Vijay Deverakonda: ఆస్పత్రి పాలైన హీరో విజయ్‌ దేవరకొండ! అభిమానుల్లో ఆందోళన.. ఏమైందంటే?

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అనారోగ్య సమస్యలతో అతను ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని సమాచారం. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రౌడీ హీరో వెంటనే కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Vijay Deverakonda: ఆస్పత్రి పాలైన హీరో విజయ్‌ దేవరకొండ! అభిమానుల్లో ఆందోళన.. ఏమైందంటే?
Actor Vijay Deverakonda

Updated on: Jul 17, 2025 | 9:18 PM

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవ‌ర‌కొండ మరికొన్ని రోజుల్లో కింగ్ డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గౌతం తిన్న‌నూరి తెరకెక్కించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటించింది. సత్యదేవ్ మరో కీలక పాత్రలో మెరిశాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 31న రిలీజ్ కానుంది. అయితే తన సినిమా రిలీజ్ కు కొన్ని రోజుల ముందే హీరో విజయ్‌ దేవరకొండ ఆస్పత్రిపాలయ్యాడు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న అతను ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని సమాచారం. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆందోళనకు గురవువుతున్నారు. విజయ్ వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నారు. కాగా విజయ్ కు బాగా విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 20 న విజయ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నట్లు సమాచారం. అయితే విజయ్ దేవరకొండ ఆరోగ్యం విషయంపై అటు అతని టీమ్ కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన  విడుదల చేయలేదు.

 

ఇవి కూడా చదవండి

ఇక కింగ్ డమ్ సినిమా విషయానికి వస్తే.. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్న నూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఒక్కసారిగా కింగ్ డమ్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి .అందుకు తగ్గట్టుగానే ఈనెల 31న పాన్ ఇండియా రేంజ్ లో కింగ్ డమ్ సినిమా రిలీజ్ కానుంది. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ఫార్చూన‌ర్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగవంశీసాయిసౌజన్య ఈ సినిమాను  నిర్మించారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. కింగ్ డమ్ తర్వాత తనకు ట్యాక్సీవాలా లాంటి సూపర్ హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లోనే మరో మూవీ చేయనున్నాడు విజయ్ దేవరకొండ.

కింగ్ డమ్ సినిమా ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ, అనిరుధ్.

31న వరల్డ్ వైడ్ రిలీజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.