Kiran Abbavaram : రాజావారు రాణిగారు ఫేం కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా చేస్తున్నాడు కిరణ్. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ డబ్బింగ్ పనులు జరుపుకుంటుంది. మే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉంది చిత్రయూనిట్. ఇక సూపర్ హిట్ సినిమా డిస్ట్రిబ్యూటర్ హక్కులను సొంతం చేసుకునే వరంగల్ శ్రీను ఈ చిత్రానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ హక్కులను దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే కిరణ్ అబ్బవరం కళ్యాణ మండపం సినిమానే కాకుండా.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సెబాస్టియన్, సమ్మతమే సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇవే కాకుండా.. కిరణ్ మరో రెండు ప్రాజెక్టులకు లైన్లో పెట్టినట్లుగా సమాచారం.
ఇందులో ఒకటి పెద్ద సినిమా కావడం విశేషం. ఇప్పటివరకు కిరణ్ చేసింది ఓకే సినిమా అయినా.. ఫుల్ ఫేమస్ అయ్యాడు. అంతేకాకుండా.. చేతులో నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. తక్కువ సమయంలో షూటింగ్స్ ముగించుకోని.. ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు యంగ్ హీరో. అంతేకాకుండా.. ఇప్పటికే కొత్త దర్శకులు, చిన్న బడ్జెట్ నిర్మాతలు కూడా కిరణ్ తదుపరి సినిమాల కోసం సంప్రదిస్తున్నారట. ఇక ఈ కుర్రహీరో కూడా స్టోరీ నచ్చడంతో.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో టాక్నీవాలా ఫేం ప్రియంకా జవాల్కర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలో సీనియర్ హీరో సాయికుమార్ హీరో తండ్రిగా నటించారు. తనికెళ్ల భరణి – తులసి – శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.
Also Read:
నితిన్ ఒప్పుకుంటాడో లేదో అనే సందేహంతోనే కథ చెప్పా.. కానీ.. రంగ్ దే డైరెక్టర్
‘101 Jillala Andagadu’: బట్టతలతో అవసరాల శ్రీనివాస్.. ఆకట్టుకుంటున్న 101జిల్లాల అందగాడు పోస్టర్..