Ugram: ఉగ్రం రుద్రపాల నేత్రం అంటున్న నరేష్.. ఆకట్టుకుంటున్న టైటిల్ ట్రాక్
కంటెంట్ ప్రాధాన్యత పై ఫోకస్ పెట్టి హిట్స్ అందుకుంటున్నారు. అందుకు ఉదాహరణే నాంది చిత్రం. డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ అవుతుంది.

తనలో కామెడీ యాంగిల్ మాత్రమే కాదు.. సీరియస్ పాత్రలను కూడా నటించి మెప్పించగలడని నిరూపించారు. నేను సినిమా తర్వాత నాంది సినిమాల్లో తన పాత్రతో మెప్పించాడు. ఇక ఇప్పుడు ఉగ్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కామెడీకి చెక్ పెట్టి సీరియస్ సినిమాలు చేస్తున్నారు. కంటెంట్ ప్రాధాన్యత పై ఫోకస్ పెట్టి హిట్స్ అందుకుంటున్నారు. అందుకు ఉదాహరణే నాంది చిత్రం. డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ అవుతుంది. ఆ సినిమానే ఉగ్రం. నరేష్ కెరీర్లో 60వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో మీర్నా మీనన్ కథానాయికగా నటిస్తుంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ మూవీ మే 5న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్.
ఈ క్రమంలోనే ఉగ్రం మూవీ నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఉగ్రం ఉగ్రం రుద్రపాల నేత్రం’ అంటూ పాట సాగుతోంది.
ఈ సినిమాలో నరేష్.. శివ కుమార్ అనే పోలీస్ అధికారి క్యారెక్టర్లో కనిపిస్తున్నాడు. తన భార్యా పిల్లలతో పాటు చాలా మంది మిస్సింగ్ అవడం వెనకున్న మిస్టరీ ఏంటి అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.
