Adipurush: ఆదిపురుష్ నుంచి సీత టీజర్.. నిండుగా కనిపించిన కృతిసనన్

ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. నిన్న మొన్నటి వరకు వివాదాలకు కేరాఫ్ గా మారిన ఆదిపురుష్ ఇప్పుడు మాత్రం వివాదాలకు అతీతంగా అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. విజువల్ ఫీస్ట్ మేనియా ఏంటో అందరికీ చిన్న శాంపిల్ గా రీలీజ్‌కు ముందే చూపించింది.

Adipurush: ఆదిపురుష్ నుంచి సీత టీజర్.. నిండుగా కనిపించిన కృతిసనన్
Adipurush
Follow us

|

Updated on: Apr 29, 2023 | 10:50 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. నిన్న మొన్నటి వరకు వివాదాలకు కేరాఫ్ గా మారిన ఆదిపురుష్ ఇప్పుడు మాత్రం వివాదాలకు అతీతంగా అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. విజువల్ ఫీస్ట్ మేనియా ఏంటో అందరికీ చిన్న శాంపిల్ గా రీలీజ్‌కు ముందే చూపించింది. త్రీడీ వరల్డ్ మ్యాజిక్‌ ఏంటో రీసెంట్‌గా కొంత మంది రిపోర్టర్లకు తెలిసేలా చేసింది. ఆదిపురుష్ త్రీడీ ట్రైలర్‌ను వారికి చూపించి.. వారిని నోరుళ్ల బెట్టేలా చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఆదిపురుష్ నుంచి సీత కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు.

ఆదిపురుష్ లో సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో సీత పాత్ర విషయంలో కూడా వివాదం రేగిన విషయం తెలిసిందే. మొన్నామధ్య విడుదల చేసిన పోస్టర్స్ లో సీత పాత్రకు బొట్టు, చేతికి గాజులు లేకపోవడంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.

కానీ ఈ సారి విడుదల చేసిన సీత టీజర్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సీత పాత్రను నిండుగా చూపించారు. కృతి సనన్ కూడా సీతగా అద్భుతంగా కనిపిస్తోంది. ఆదిపురుష్ సినిమా జూన్‌ 16న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రబృందం.