సోషల్ మీడియా ఎఫెక్ట్.. సెలబ్రెటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైన క్షణాల్లో వైరలవ్వాల్సిందే. సినీ స్టార్స్ పర్సనల్ విషయాల నుంచి మూవీ అప్డేట్స్ వరకు ప్రతి విషయం తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఇదే విషయాన్ని గమనించిన మేకర్స్.. తమ సినిమా ప్రమోషన్లను సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఇదే ఫార్ములాను ఫాలో అయ్యింది హీరోయిన్ నివేదా పేతురాజ్. ఈ ముద్దుగుమ్మ రెండు రోజుల క్రితం పోలీసులతో గొడవపడుతున్న ఓ వీడియో నెట్టింట వైరలైన సంగతి తెలిసిందే. అందులో నివేదా కారులో వెళ్తుండగా.. ఆమె కారును పోలీసులు అడ్డుకోవడం.. డిక్కీ ఒపెన్ చేయాలని చెబితే పరువుకు సంబంధించిన విషయం అంటూ పోలీసులతోనే గొడవ పడింది నివేదా. డిక్కీ ఒపెన్ చేయను ఎందుకంటే ఇది నా పరువుకు సంబంధించిన విషయం అంటూ పోలీసులతో వాదించింది. అలాగే అక్కడే వీడియో తీస్తున్న వ్యక్తిపై సీరియస్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అసలు నివేదాకు ఏమైందంటూ నెటిజన్స్ షాకయ్యారు. ఉన్నట్లుండి పోలీసులతో ఈ బ్యూటీకి గొడవేంటీ అంటూ సందేహాలు వ్యక్తమయ్యాయి.
తాజాగా నివేదా పోలీసులతో గొడవ పడడానికి గల అసలు కారణం తెలిసిపోయింది. ఇదంతా కేవలం మూవీ ప్రమోషన్లలో భాగమేనని తేలిపోయింది. తాజాగా ఈ విషయాన్ని జీ5 ట్వీట్ చేస్తూ నివేదా కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించింది. నివేదా పోలీసులతో గొడవ పడిన వీడియోను షేర్ చేస్తూ పరువు పేరుతో కొత్త సినిమా రాబోతుందంటూ వెల్లడించింది. ఇందులో నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ మూవీ జూన్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. దీంతో నివేదా పోలీసుల గొడవ అంతా పబ్లిసిటీ స్టంట్ అని తేలడంతో షాకవుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుంది.
నివేదా పేతురాజ్.. మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించినా ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మెరిసింది. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. ఇక ఇప్పుడు ఓటీటీలో పరువు అనే సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది.
Here you go! Not caught in the act, but really one for our latest original #PARUVUonZee5@GoldBoxEnt @sushkonidela @NagaBabuOffl #vishnulaggishetty @saranyapotla @Nivetha_Tweets @nareshagastya @patnaikpraneeta #AmitTiwari @pavansadineni @siddharth_vox @Rajvadlapati pic.twitter.com/z0ILXhKE7w
— ZEE5 Telugu (@ZEE5Telugu) May 31, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.