
మ్యూజిక్.. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆనందం, ప్రేమ, బాధ.. ఇలా అన్ని అంశాలను కలగలిపి ఉండే పాటలు చాలా ఉన్నాయి. ప్రతి పాట మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కానీ మీకు తెలుసా.. ? ఒక పాటను దాదాపు 62 ఏళ్లు బ్యాన్ చేశారని మీకు తెలుసా.. ? 1933లో హంగేరియన్ స్వరక్త రెజ్సో సెరెస్ ఈ విచారకరమైన పాటను రాశారు. ఈ సాంగ్ శ్రోతలను మరణాలవైపు నడిపిస్తుందని ప్రచారం నడిచింది. అదే గ్లూమీ సండే అనే సాంగ్. సెరెస్ తన స్నేహితురాలు తనను విడిచిపెట్టిన తర్వాత తన హృదయ బాధ నుంచి పుట్టింది. భరించలేని బాధకు ఓదార్పుగా ఈ పాటను రాసుకున్నారు.
ఇవి కూడా చదవండి : Ramya Krishna: రమ్యకృష్ణ కొడుకును చూశారా..? తనయుడితో కలిసి శ్రీవారి దర్శనం.. వీడియో వైరల్..
అయితే ఈ పాటను రిలీజ్ చేయడానికి రికార్డ్ కంపెనీలు నిరాకరించాయి. 1935లో గ్లూమీ సండె పాటను రిలీజ్ చేశారు. కానీ ఈ పాట వింటూ హంగేరీలో ఆత్మహత్యలు జరిగాయి. చనిపోయిన వారి దగ్గర ఈ పాట వినిపించిందని.. కొందరు సూసైడ్ లేఖలలో పాట గురించి ప్రస్తావించారని నివేదికలలో వెలువడింది. అప్పట్లో దాదాపు 100 మంది వరకు ఈ పాట వింటూ చనిపోయారని.. దీంతో ప్రభుత్వం ఈ పాటను చాలా ప్రమాదకరమైనదని భావించి.. పూర్తిగా నిషేదించింది. దాదాపు 62 ఏళ్లపాటు ఈ పాటను బ్యాన్ చేశారట. చివరకు 2003లో నిషేదం ఎత్తివేశారు. ఈ పాట రాసిన సెరెస్ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?
చీకటి గతం ఉన్నప్పటికీ, గ్లూమీ సండే పాట శ్రోతలను ఆకర్షిస్తూనే ఉంది. 100 కంటే ఎక్కువ మంది గాయకులు దీనిని 28 భాషలలో రికార్డ్ చేశారు. అత్యంత ప్రసిద్ధ వెర్షన్ బిల్లీ హాలిడే నుండి వచ్చింది.
ఇవి కూడా చదవండి : Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..
ఇవి కూడా చదవండి : Actress : అబ్బబ్బ.. ఏం అందం రా బాబూ.. 42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..