
ఈ మధ్యకాలంలో సినిమాల రేంజ్ మారిపోయింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. కథలో బలం ఉంటే పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టొచ్చని చాలా సినిమాలు నిరూపించాయి. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా కలెక్షన్స్ లో కుమ్మేస్తున్నాయి. అయితే మాములుగా సినిమా అంటే ఆరు ఫైట్స్, నాలుగు అదిరిపోయే సాంగ్స్, ముఖ్యంగా స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే.. చాలా సినిమాలు ఇదే ఫార్మేట్ తో వస్తున్నాయి. మరికొన్ని సినిమాలు పెద్ద హీరో, గ్లామరస్ హీరోయిన్స్ తో తెరకెక్కుతున్నాయి కానీ కొన్ని సినిమాలు మాత్రం అలా కాదు.. కథను బేస్ చేసుకొని తెరకెక్కిస్తున్నారు. పాటలు, ఫైట్స్ లేకుండా వచ్చి హిట్ కొట్టిన సినిమాలు కొని ఉన్నాయి.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా చాలా డిఫరెంట్ ఈ సినిమాలో మనం ఉహిచినట్టు.. అందాల హీరోయిన్స్, సాంగ్స్, ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ వంటివి ఉండవు.. కానీ ఇండస్ట్రీని షేక్ చేసింది ఆ సినిమా. కేవలం హీరో ఒక్కడి మీదే నడిచే సినిమా ఇది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఉండదు. హీరో అతని, కూతురి గురించే ఈ సినిమా కథ ఉంటుంది. అలాగే సాంగ్స్ కూడా ఉండవు ఈ సినిమాలో కానీ ఫైట్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటాయి. ఎలివేషన్స్ కు కొదవే ఉండదు. ఇప్పటికే ఈ సినిమా ఎదో మీరు కనిపెట్టేసి ఉంటారు. ఆ సినిమా ఎదో కాదు .. తమిళ్ స్టార్ హీరో కార్తీ నటించిన ఖైదీ.
స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కార్తీ తన నటనతో ఆకట్టుకున్నాడు.ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మించారు. ఖైదీ సినిమా 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో విడుదలై, 7.15 కోట్ల షేర్‌తో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది, 3.15 కోట్ల లాభాలను అందించింది. ఈ చిత్రం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో మొదటి చిత్రం. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.