Telugu Cinema: పెళ్లి చేసుకోను.. కానీ పిల్లలను కనాలని ఉంది.. టాలీవుడ్ హీరోయిన్..

సినీరంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగా ప్రశంసలు అందుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. తెలుగు, హిందీ భాషలలో ఎక్కువగా స్పెషల్ పాటలతో పాపులర్ అయ్యింది. అయితే తాజాగా ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Telugu Cinema: పెళ్లి చేసుకోను.. కానీ పిల్లలను కనాలని ఉంది.. టాలీవుడ్ హీరోయిన్..
Edin Rose

Updated on: Jun 25, 2025 | 9:00 AM

భారతీయ సినిమా పరిశ్రమలో నటీనటులుగా గురింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. కానీ సినీప్రయాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. సినీరంగంలో అవకాశాలు అందిపుచ్చుకోవడం అంత సులభం కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మాత్రం ఎక్కువగా స్పెషల్ పాటలతోనే ఫేమస్ అయ్యింది. ఈ నటి మెగా బడ్జెట్ పాన్ ఇండియా చిత్రంలో స్పెషల్ సాంగ్ తో రచ్చ చేసింది. ఇది మాత్రమే కాదు ఆమె అనేక వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. కానీ ఆమె ‘బిగ్ బాస్’లో కనిపించిన తర్వాతే మరింత పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఈ నటి వయస్సు కేవలం 27 సంవత్సరాలు. అంతేకాదు కొన్నాళ్లుగా ఆమె పేరు యువ క్రికెటర్‌తో ముడిపడి ఉంది. దుబాయ్‌లో జన్మించిన ఈ నటి 2023 తెలుగు సినిమా ‘రావణాసుర’లో ప్రత్యేక పాటలో కనిపించింది.

ఇందులో మాస్ మహరాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఆమె పేరు ఈడెన్ రోజ్. దుబాయ్‌లో 20 ఆగస్టు 1998న జన్మించారు. ఆమె తల్లి కర్ణాటకకు చెందిన స్త్రీ. ఈడెన్ 20 సంవత్సరాల వయసులో ‘గండి బాత్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఆ తర్వాత ఆమె గుడ్ గర్ల్-బ్రైడ్ నైట్‌లో కూడా కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఈడెన్ రోజ్ తనను తాను భారతదేశపు కిమ్ కర్దాషియాన్ గా భావిస్తుంది. రావణాసుర’ ఫ్లాప్ తర్వాత ఈడెన్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. గతేడాది ‘బిగ్ బాస్ 18’లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. అయితే తాను క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్‌ను పిచ్చిగా ప్రేమిస్తున్నానని.. అతడిని మనసులో తన భర్తగా అంగీకరించానని.. అతడితో ఇద్దరు పిల్లలను కూడా ఊహించుకున్నానని తెలిపింది. ఈడెన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అలాగే తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని.. కానీ పిల్లలను మాత్రం కనాలని ఉందని.. అందుకే తను ఎగ్ ఫ్రీజ్ పద్దతి ఫాలో కావాలనుకుంటున్నట్లు తెలిపింది. దీంతో ఇప్పుడు ఈడెన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాశంగా మారాయి.

ఇవి కూడా చదవండి : 

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..