
సినీరంగంలో ఇప్పుడిప్పుడే నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. సోషల్ మీడియాలో పాపులర్ అయి.. ఇప్పుడు సినిమాల్లో హాస్యనటుడిగా రాణిస్తున్నాడు. అటు సినిమాలతో బిజీగా ఉంటూనే.. నిజ జీవితంలో ఎంతో మందికి సాయం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడుతున్నాడు. అతడు మరెవరో కాదు.. కెబివై బాలా. తమిళంలో అతడిని కెబివై అని పిలుస్తుంటారు. ఆయన కారైకల్‌లో పుట్టి పెరిగారు. అక్కడే పాఠశాల విద్యను పూర్తి చేశారు. సినిమాల్లో నటించాలనే కోరికతో చెన్నైకి వచ్చి టెలివిజన్‌లో నటించడం ప్రారంభించాడు. యార్ షోతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. వివిధ స్టేజ్ షోలకు కూడా ఆయన హోస్ట్‌గా వ్యవహరించారు. సినిమాల్లో నటిస్తూనే రియల్ లైఫ్ లో కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడ్డారు. అంబులెన్స్ సౌకర్యాలు లేని గ్రామాలకు ఉచిత అంబులెన్స్ సౌకర్యాలను అందించారు.
ఇవి కూడా చదవండి : Cinema: 70 లక్షల బడ్జెట్.. 75 కోట్ల కలెక్షన్స్.. కట్ చేస్తే.. 12 సంవత్సరాలు థియేటర్లలో దుమ్మురేపిన సినిమా..
అలాగే నారోగ్యంతో, ఆర్థిక సంక్షోభంలో ఉన్న నటులకు ఆర్థిక సహాయం అందించారు. సినిమాలతో వచ్చే డబ్బును పేద ప్రజలకు అందిస్తున్నాడు. గ్రామాలకు అంబులెన్స్‌లు కొనుగోలు చేయడం వంటి అనేక సహాయాల ద్వారా బాలా జనాలకు దగ్గరయ్యారు. కె.పి.వై. బాలా, రాఘవ లారెన్స్ చేంజ్ అనే సేవా ఫౌండేషన్‌ను ప్రారంభించి చాలా మందికి సహాయం చేస్తున్నారు. ఇప్పుడు బాలా నటించిన గాంధీ కన్నా చిత్రం థియేటర్లలో విడుదల కానుది. ఈ మూవీ ప్రమోషన్లలో బాలా చెప్పిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట తెగ వైరలవుతుంది.
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. బుల్లిగౌనులో సీరియల్ బ్యూటీ రచ్చ.. గ్లామర్ ఫోజులతో గత్తరలేపుతున్న వయ్యారి..
Kpy Bala. Movie S
తన సోదరి పట్టుదల కోసం చెన్నైలో ఇల్లు కట్టుకోవాలని ఒక స్థలాన్ని కొనుగోలు చేశాడట. చాలా సంవత్సరాలుగా బుల్లితెరపై సంపాదించిన డబ్బుతో ఆ స్థలాన్ని కొనుగోలు చేశారు. కానీ చాలా మంది వైద్య చికిత్స కోసం ఎదురుచూస్తున్నారని.. అందుకు సరైన ఆసుపత్రి కావాలని నిర్ణయించుకున్నారు. వెంటనే తన నిర్ణయాన్ని నటుడు అముతవనన్ కు వివరించారు. ప్రస్తుతం దాదాపు 80 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని లైసెన్సులు మాత్రమే రావాల్సి ఉండగా, తన జీవితకాల కలగా మారిన ఈ ఉచిత ఆసుపత్రిని రెండు మూడు నెలల్లో ప్రారంభిస్తానని కేపీవై బాల ప్రకటించారు.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ సీజన్ 9లోకి ప్రభాస్ హీరోయిన్.. సెన్సేషనల్ ఫోక్ సింగర్.. ఫుల్ లిస్ట్ ఇదే..
ఇవి కూడా చదవండి : Tollywood : అక్కినేని మూడు తరాలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యతో సినిమాలు.. ఎవరంటే..