Tollywood: టాలీవుడ్‌లో 100 కోట్ల వార్.. రేస్‌లో ఉన్న హీరోలు వీరే

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా... బులెట్ దిగిందా లేదా..? అదీ తేలాల్సిన లెక్క. టాలీవుడ్ లో టాప్ హీరోలందరూ పాన్ ఇండియా మూవీస్ తో ఔటాఫ్ టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తుంటే..

Tollywood: టాలీవుడ్‌లో 100 కోట్ల వార్.. రేస్‌లో ఉన్న హీరోలు వీరే
Tollywood Heros

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా… బులెట్ దిగిందా లేదా..? అదీ తేలాల్సిన లెక్క. టాలీవుడ్ లో టాప్ హీరోలందరూ పాన్ ఇండియా మూవీస్ తో ఔటాఫ్ టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తుంటే.. సెకండ్ రో హీరోలు మాత్రం.. వంద కోట్ల క్లబ్బులో ప్లేస్ కోసం ఆరాతపడుతున్నారు. కొత్త-పాత హీరోల మధ్య ఈ కాంపిటీషన్ కాస్త రసవత్తరంగానే వుంది. తొమ్మిదేళ్ల కిందట జక్కన్న లీడర్ షిప్ లో చేసిన ఈగ సినిమా నేచురల్ స్టార్ నానీని 100 కోట్ల క్లబ్బులో చేర్చింది. మూవీలో నానీ పోర్షన్ కొంచెమే అయినా.. కంటెంట్ పరంగా అప్పట్లోనే 105 కోట్లు కలెక్ట్ చేసింది ఈగ. మళ్ళీ ఆ రేంజ్ కమర్షియల్ హిట్ నానీ ఖాతాలో పడలేదు. రీసెంట్ ఇయర్స్ లో గీతగోవిందం కూడా అటువంటి సర్ ప్రైజే ఇచ్చింది. విజయ్ దేవరకొండకు ఇదొక మేజికల్ మూమెంట్. హాఫ్ సెంచరీకి ముందే సెంచరీ కొట్టడమంటే మామూలు విషయం కాదు!

మళ్ళీ ఆ వందకోట్ల అనుభవాన్ని చవిచూడ్డానికి చాలామంది యంగ్ హీరోస్ రెడీ అవుతున్నారు. రెగ్యులర్ మార్కెట్ 30 కోట్లకు మించి లేని కథానాయకులంతా సెంచరీ ఛాన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా ప్రతీరోజూ పండగే సినిమాతో తన రేంజ్ ని 32 కోట్లకు పెంచుకున్నారు సాయి ధరమ్ తేజ్. ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ తర్వాత అయ్యామ్ అల్సొ 30 క్రోర్స్ ఇండస్ట్రీ అంటున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. సమంతతో కలిసి చేసిన మజిలీతో 37 కోట్లు వసూలు చేసిన చైతూ కూడా శేఖర్ కమ్ముల మూవీ లవ్ స్టోరీతో బిగ్ టార్గెట్ కి గురి పెట్టారు.

రామ్- ఇస్మార్ట్ శంకర్, నితిన్ – భీష్మ … థర్టీ ప్లస్ వసూలు చేశాయి. నిన్నమొన్న సంక్రాంతి విన్నర్ గా నిలిచిన రవితేజ క్రాక్ కూడా 38 కోట్లు దండుకుంది. ఇప్పుడు వీళ్లందరి చేతుల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ రెడీ అవుతున్నాయి. నాని అయితే టక్ జగదీష్, శ్యామ్ సింగ రాయ్ లాంటి వెరైటీ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండను కూడా యంగ్ హీరోల జాబితాలో కలిపితే.. ఆయన కూడా లైగర్ తో గట్టిగానే కొట్టబోతున్నారు. సో.. నెక్స్ట్ సర్ప్రైజింగ్ సెంచరీ ఎవరి ఖాతాలో పడుతుంది అనేది ఒక బిగ్ సస్పెన్స్.

Also Read: త‌న 4am ఫ్రెండ్ ఎవరో రివీల్ చేసిన మంచు విష్ణు.. అత‌ను కూడా టాలీవుడ్ హీరోనే అండోయ్

ప‌వ‌ర్ స్టార్ రేంజ్ అంటే ఇది… పీఎస్‌పీకే 28 నేషనల్ లెవల్‌లో ట్రెండింగ్