Tollywood: థియేటర్లలో విడుదలై ఇంకా ఓటీటీలోకి రానీ సినిమాలు ఇవే.. ఏఏ చిత్రాలు ఉన్నాయంటే..

|

Jun 09, 2024 | 1:08 PM

అటు వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తూనే మరోవైపు థియేటర్లలో సక్సెస్ అయిన చిత్రాలను భారీ ధరకు కొనుగోలు చేస్తున్నాయి. కానీ విడుదలకు ముందు మంచి బజ్ చేసుకుని థియేటర్లో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. సరికొత్త కంటెంట్.. ట్విస్టులతో ఆసక్తిని రేకెత్తించిన పలు చిత్రాలు థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. కానీ ఇప్పటికీ ఓటీటీలో రిలీజ్ కాలేదు. అవెంటో ఇప్పుడు చూద్దాం.

Tollywood: థియేటర్లలో విడుదలై ఇంకా ఓటీటీలోకి రానీ సినిమాలు ఇవే.. ఏఏ చిత్రాలు ఉన్నాయంటే..
Ott Movies
Follow us on

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సూపర్ హిట్ చిత్రాలపై ఫోకస్ చేస్తున్నాయి. అటు థియేటర్లలో విడుదలై నెల రోజులు పూర్తికాకముందే స్ట్రీమింగ్ చేస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను నెల రోజుల్లోనే ఓటీటీలోకి తీసుకువస్తున్నారు. సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తీసుకవచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అటు వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తూనే మరోవైపు థియేటర్లలో సక్సెస్ అయిన చిత్రాలను భారీ ధరకు కొనుగోలు చేస్తున్నాయి. కానీ విడుదలకు ముందు మంచి బజ్ చేసుకుని థియేటర్లో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. సరికొత్త కంటెంట్.. ట్విస్టులతో ఆసక్తిని రేకెత్తించిన పలు చిత్రాలు థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. కానీ ఇప్పటికీ ఓటీటీలో రిలీజ్ కాలేదు. అవెంటో ఇప్పుడు చూద్దాం.

లాల్ సలామ్..
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం లాల్ సలామ్. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై నాలుగు నెలలు దాటింది. కానీ ఇప్పటివరకు ఓటీటీ రిలీజ్ డేట్ పై ఎలాంటి క్లారిటీ రాలేదు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9న అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఇప్పటివరకు ఓటీటీలో రిలీజ్ కాలేదు.

రాజాకార్..
తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో వచ్చిన సినిమా రాజాకార్. మార్చి 15న థియేటర్లలో విడుదలైన మంచి రెస్పాన్స్ అందుకుంది. కానీ ఇప్పటివరకు ఈ మూవీ ఓటీటీలోకి రాలేదు. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను జీ5 దక్కించుకుందని టాక్ నడుస్తుంది.

ఏజెంట్..
అక్కినేని అఖిల్ నటించిన చిత్రం ఏజెంట్. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సోనీలివ్ దక్కించుకుంది. కానీ లీగల్ పరమైన సమస్యల వల్ల ఈ సినిమా ఓటీటీ రిలీజ్ వాయిదా పడింది.

రాజశేఖర్ శేఖర్..
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన డిఫరెంట్ క్స్‌పీరిమెంట‌ల్ హార‌ర్ ఫిల్మ్‌ రాజశేఖర్ శేఖర్. థియేటర్లలో విడుదలై మంచి రివ్యూ అందుకున్న ఈ మూవీ అటు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. కానీ ఇప్పటివరకు ఓటీటీలో మాత్రం విడుదల కాలేదు. లీగల పరమైన సమస్యల కారణంగా ఈ మూవీ ఓటీటీ విడుదల కావడం లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.