Tollywood: ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్ కాబోతున్న సినిమాలు.. థియేటర్/ఓటీటీలో డబుల్ ఎంటర్టైన్మెంట్..

|

Apr 24, 2023 | 2:36 PM

హర్రర్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇప్పుడు ఏప్రిల్ చివరి వారంలోనూ ప్రేక్షకులను అలరించేందుకు మరిన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కేవలం బాక్సాఫీస్ వద్ద కాదు.. ఓటీటీలోనూ ఫుల్ వినోదాత్మక చిత్రాలు రాబోతున్నాయి. అవెంటో తెలుసుకుందామా.

Tollywood: ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్ కాబోతున్న సినిమాలు.. థియేటర్/ఓటీటీలో డబుల్ ఎంటర్టైన్మెంట్..
Upcoming Movies
Follow us on

సమ్మర్ హాలీడేస్ వచ్చాయి. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు థియేటర్ల వద్ద బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు సందడి చేస్తున్నాయి. చిన్న, పెద్ద సంబంధం లేకుండా కంటెంట్ నచ్చితే చాలు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. ఇటీవల బలగం, విరూపాక్ష, దసరా చిత్రాలు ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలే కాకుండా.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలు సైతం థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విరూపాక్ష హవా కొనసాగుతుంది. హర్రర్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇప్పుడు ఏప్రిల్ చివరి వారంలోనూ ప్రేక్షకులను అలరించేందుకు మరిన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కేవలం బాక్సాఫీస్ వద్ద కాదు.. ఓటీటీలోనూ ఫుల్ వినోదాత్మక చిత్రాలు రాబోతున్నాయి. అవెంటో తెలుసుకుందామా.

ఏజెంట్..
అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఏజెంట్. ఇప్పటివరకు లవర్ బాయ్ గా కనిపించిన అఖిల్ ఈసినిమాతో యాక్ష్ హీరోగానూ మెప్పించేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో సాక్షి వైద్య కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయమవుతుంది. ఇందులో మమ్ముట్టి కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల కానుంది.

పొన్నియన్ సెల్వన్ 2..
డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ 2. గతంలో రిలీజ్ అయిన పార్ట్ 1 మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్ట్ 2 రాబోతుంది. విక్రమ్ చియాన్, ఐశ్వర్య, త్రిష, జయం రవి, కార్తి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతోపాటు.. తమిళం, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను క్రియేట్ చేసింది. మరోవైపు ఇందులోని పాటలు ఆకట్టుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

రారా.. పెనిమిటి..
చాలా కాలం తర్వాత నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం రారా పెనిమిటి. సత్య వెంకట గెద్దాడ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. సింగిల్ క్యారెక్టర్ తో నడిచే ఈ చిత్రం ఏఫ్రిల్ 28న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో తెరపై కనిపించేది ఒక్క పాత్రే అయినా.. వినిపించే పాత్రలకు బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సునీల్, సప్తగిరి, హేమ, అన్నపూర్ణమ్మ వాయిస్ అందించడం విశేషం.

శిసు..
జల్మరీ హెలెండర్ దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్ మూవీ శిసు. జోర్మా తొమ్మిలా. అక్సెల్ హెన్ని జాన్ కీలకపాత్రల పోషించారు. ఈ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది.

ఓటీటీలో రిలీజ్ కాబోయే చిత్రాలు..

నెట్ ఫ్లిక్స్..
దసరా.. ఏప్రిల్ 27.
కోర్ట్ లేడీ .. హిందీ వెబ్ సిరీస్.. ఏప్రిల్ 26.
నో వోల్యాండ్.. వెబ్ సిరీస్.. ఏప్రిల్ 26.
ది గుడ్ బ్యాడ్ మదర్.. వెబ్ సిరీస్.. ఏప్రిల్ 27
ఎకా..హాలీవుడ్.. ఏప్రిల్ 28
బిఫోర్ లైఫ్ ఆప్టర్ డెత్.. హాలీవుడ్.. ఏప్రిల్ 28

అమెజాన్ ప్రైమ్..
సిటాడెల్.. ఏప్రిల్ 28
పత్తు తల.. తమిళ్ మూవీ.. ఏప్రిల్ 27

జీ5..
వ్యవస్థ.. ఏప్రిల్ 28
యూటర్న్.. హిందీ.. ఏప్రిల్ 28

డిస్నీ ప్లస్ హాట్ స్టార్..
సేవ్ ది టైగర్స్.. తెలుగు సిరీస్.. ఏప్రిల్ 27
పీటర్ పాన్ అండ్ వెండీ.. హాలీవుడ్.. ఏప్రిల్28

సోనీలివ్..
తురముఖమ్.. మలయాళి చిత్రం.. ఏప్రిల్ 28