
వేసవికాలం మొదలైంది. దీంతో అటు సమ్మర్ హాలీడేస్ సైతం వచ్చేస్తున్నాయి. దీంతో ప్రేక్షకులను అలరించేందుకు ఇప్పుడు సరికొత్త సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈసారి స్టార్ హీరోస్ సినిమాలు కాకుండా ఏప్రిల్ మొదటి వారంలో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఇటు థియేటర్లలోనే కాకుండా ఇటు ఓటీటీలో పలు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అలాగే ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సినిమాలు ఇప్పుడు మరోసారి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అందులో ఆదిత్య 369 ఒకటి. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఉగాది పండగ సందర్భంగా ఈ సినిమా రీరిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. ఇంతకీ ఏప్రిల్ మొదటి వారంలో విడుదలయ్యే సినిమాలు ఏంటో తెలుసుకుందామా.
ఆదిత్య 369..
నందమూరి బాలకృష్ణ కెరీర్ లో వన్ ఆఫ్ ది సూపర్ హిట్ మూవీ ఆదిత్య 369. ఈ సినిమాను ఏప్రిల్ 4న రీరిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
ఎల్వైఎఫ్: లవ్ యువర్ ఫాదర్..
దాదాపు 20 ఏళ్ల తర్వాత నటుడిగా వెండితెరపై సందడి చేయబోతున్నారు గాయకుడు ఎస్పీ చరణ్. ఆయన కీలకపాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ ఎల్వైఎఫ్: లవ్ యువర్ ఫాదర్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 4న విడుదల కానుంది.
శారీ..
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా శారీ. ఇందులో సత్య యాదు, ఆరాధ్యదేవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఏప్రిల్ 4న రిలీజ్ చేయనున్నారు.
28 డిగ్రీస్ సెల్సియస్..
నవీన్ చంద్ర, ప్రియదర్శి, వైవా హర్ష, షాలిని కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా 28 డిగ్రీస్ సెల్సియస్. ఈ సినిమాను ఏప్రిల్ 4న రిలీజ్ కానుంది.
వృషభ..
అశ్విన్ కామరాజ్ కొప్పల తెరకెక్కించిన వృషభ సినిమాను ఏప్రిల్ 4న రిలీజ్ కానుంది.
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
ఆహా..
హోం టౌన్.. తెలుగు.. ఏప్రిల్ 4
సోనీలివ్..
నెట్ ఫ్లిక్స్..
జియో హాట్ స్టార్..
జీ5..
కింగ్ స్టన్.. తెలుగు.. ఏప్రిల్ 4