Tollywood: సినీ లవర్స్ బీ రెడీ.. ఈవారం థియేటర్‏లలో/ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఇవే..

|

May 02, 2023 | 12:31 PM

ఈ వారం మరిన్ని సినిమాలు రిలీజ్ అయ్యేందుకు అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్నాయి. మరోవైపు ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్.. వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా.. కామెడీ కథా చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరీ ఈవారం ఆడియన్స్ ముందుకు రాబోతున్న సినిమాలేంటో తెలుసుకుందామా.

Tollywood: సినీ లవర్స్ బీ రెడీ.. ఈవారం థియేటర్‏లలో/ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
Ramabanam
Follow us on

ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తున్నారు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది… ఇక ఈ మండు వేసవిలో గత మూడు నాలుగు రోజులుగా అకాల వర్షాలు వాతావరణం చల్లబడింది. కానీ అటు వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఈ వారం మరిన్ని సినిమాలు రిలీజ్ అయ్యేందుకు అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్నాయి. మరోవైపు ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్.. వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా.. కామెడీ కథా చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరీ ఈవారం ఆడియన్స్ ముందుకు రాబోతున్న సినిమాలేంటో తెలుసుకుందామా.

రామబాణం..
మ్యాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం రామబాణం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జగపతి బాబు, ఖుష్బూ కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మే 5న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

ఉగ్రం..
నాంది సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హీరో అల్లరి నరేష్.. ఇప్పుడు మరోసారి సీరియస్ తరహా మూవీతో రాబోతున్నారు. డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ నటిస్తోన్న చిత్రం ఉగ్రం. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా మే 5న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మానవ అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

అరంగేట్రం..
రోషన్ జెడ్, ముస్తఫా ఆస్కరి, శ్రీనివాస్, అనిరుధ్, లయ, ఇందు, శ్రీవల్లి, విజయ, సాయి శ్రీ జబర్ధస్త్ సత్తిపండు ప్రధాన పాత్రలలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం అరంగేట్రం. ఈ చిత్రానికి శ్రీనివాస్ ప్రభన్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మే 5న థియేటర్లలో విడుదల కాబోతుంది.

యాద్గిరి అండ్ సన్స్..
బిక్షపతి రాజు పందిరి దర్శకత్వం వహిస్తున్న సినిమా యాద్గిరి అండ్ సన్స్. అనిరుధ్ తుకుంట్ల, యశ్విని నివేదిత, జీవా, రాజీవ్ కనకాల, మధుమణి, మురళీధర్ గౌడ్, రోహిత్ తదితరులు నటించిన ఈ సినిమా మే 5న థియేటర్లలో విడుదల కానుంది.

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు..
జీ5..
ఫైర్ ఫ్లైస్.. హిందీ సిరీస్.. మే 5
షెభాష్ ఫెలూద..బెంగాలీ.. మే5

డిస్నీ ప్లస్ హాట్ స్టార్..
కరోనా పేపర్స్.. మలయాళ చిత్రం.. మే 5న
సాస్ బహూ జౌర్ ఫ్లమింగో.. హిందీ.. మే 5

నెట్ ఫ్లిక్స్..
క్లిఫర్డ్.. దిబిగ్ రెడ్ డాగ్.. ఇంగ్లీష్.. మే 2
ది టేర్‌.. ఇంగ్లీష్‌.. మే 2
క్వీన్‌ షార్లెట్‌: ఏ బ్రిడ్జిర్టన్‌ స్టోరీ…..వెబ్‌సిరీస్‌… మే 4
శాంక్చురీ… మూవీ…మే 4
ది లార్వా ఫ్యామిలీ… యామినేషన్‌… మే 4
మీటర్‌:…తెలుగు… మే 5
తూ ఝూటీ మై మక్కార్‌…హిందీ… మే 5
3…తెలుగు..మే 5
అమృతం చందమామలో…తెలుగు.. మే 5
యోగి …తెలుగు.. మే5
రౌడీ ఫెలో..తెలుగు.. మే 5
తమ్ముడు…తెలుగు…మే 5

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.