Star Heroes: పొరుగు సినిమాల్లో తళుక్కుమంటున్న స్టార్‌ హీరోలు వీళ్ళే..

ఓ వైపు మెయిన్‌ లీడ్స్ చేస్తూనే, ఏదో ఒక రీజన్‌తో పొరుగు సినిమాల్లో తళుక్కుమంటున్న స్టార్‌ హీరోల మీద ఫోకస్‌ చేద్దామా.. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్‌లో గెస్ట్ రోల్‌ చేశారు భాయీజాన్‌ సల్మాన్‌ఖాన్‌.

Star Heroes: పొరుగు సినిమాల్లో తళుక్కుమంటున్న స్టార్‌ హీరోలు వీళ్ళే..
Star Heroes

Edited By:

Updated on: Jul 17, 2023 | 1:09 PM

సొంత పని కొంత మానుకుని పొరుగువారికి సాయపడవోయ్‌ అనే మాటను పదే పదే గుర్తుచేసుకుంటున్నారు పొరుగు హీరోలు. అందుకే అవకాశం వచ్చిన ప్రతిసారీ పొరుగువారికి సాయపడుతున్నారు. ఓ వైపు మెయిన్‌ లీడ్స్ చేస్తూనే, ఏదో ఒక రీజన్‌తో పొరుగు సినిమాల్లో తళుక్కుమంటున్న స్టార్‌ హీరోల మీద ఫోకస్‌ చేద్దామా.. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్‌లో గెస్ట్ రోల్‌ చేశారు భాయీజాన్‌ సల్మాన్‌ఖాన్‌. ఆయన గెస్ట్ అప్పియరెన్స్ జస్ట్ సౌత్‌కే పరిమితం చేసుకోలేదు, నార్త్ లోనూ సేమ్‌ టైప్‌ హెల్ప్ చేశారు. షారుఖ్‌ మూవీ పఠాన్‌లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు సల్మాన్‌ భాయ్‌. ఇప్పుడు సల్మాన్‌ టైగర్‌3లో నటించి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు షారుఖ్‌.

జవాన్‌ సినిమాలో సౌత్‌ స్టార్‌ ఒకరు గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఇటీవల విడుదలైన ప్రివ్యూలో దళపతి విజయ్‌ రూపాన్ని పోల్చుకునే ప్రయత్నం చేశారు ఫ్యాన్స్. ఇప్పటిదాకా అఫిషియల్‌ అనౌన్స్ మెంట్‌ లేకపోయినా, విజయ్‌ యాక్ట్ చేశారన్నది మాత్రం అందరూ నమ్ముతున్న విషయం.

సౌత్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా తన కూతురు ఐశ్వర్య సినిమా లాల్‌ సలామ్‌లో మొయిద్దీన్‌ భాయ్‌ గెటప్‌లో గెస్ట్ రోల్‌ చేశారు. ఆయన హీరోగా నటిస్తున్న జైలర్‌లో చాలా మంది ఫ్రెండ్లీ అప్పియరెన్స్ చేస్తున్నారు. మలయాళం నుంచి మోహన్‌లాల్‌, కన్నడ నుంచి శివరాజ్‌కుమార్‌, తమిళ్‌ నుంచి శివకార్తికేయన్‌ నటిస్తున్నారు జైలర్‌లో. ఫ్రెండ్లీ అప్పియరెన్స్ వల్ల ఆడియన్స్ కి స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఉంటుందని, సినిమా హైప్‌కి ఉపయోగపడుతుందని అంటున్నారు మేకర్స్.