Daggubati Venkatesh: విక్టరీ వెంకటేష్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

కలియుగపాండవులు సినిమాతో వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు వెంకటేష్. ప్రముఖ నిర్మాత రామానాయుడు తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్. ఇక హీరోగా చాలా సినిమాలు చేశారు వెంకీ.

Daggubati Venkatesh: విక్టరీ వెంకటేష్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన హీరోయిన్స్ ఎవరో తెలుసా..?
Venkatesh

Updated on: Dec 31, 2022 | 5:09 PM

హీరోగా తెలుగు సినీఇండస్ట్రీలో తిరుగులేకుండా రాణిస్తున్నారు విక్టరీ వెంకటేష్. మెయిన్ హీరోగా చేస్తూనే మరో వైపు మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. యాంగ్ హీరోలతో కూడా నటిస్తూ అలరిస్తున్నారు వెంకీ. కలియుగపాండవులు సినిమాతో వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు వెంకటేష్. ప్రముఖ నిర్మాత రామానాయుడు తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్. ఇక హీరోగా చాలా సినిమాలు చేశారు వెంకీ. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు వెంకీ. అలాగే వెంకటేష్ ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్స్ ను పరిచయం చేశారు. బాలీవుడ్ హీరోయిన్స్ ను కూడా వెంకటేష్ టాలీవుడ్ కు పరిచయం చేశారు. వెంకటేష్ పరిచయం చేసిన హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం..

వెంక‌టేష్ హీరోగా న‌టించిన కలియుగ పాండవులు సినిమాతో ఖుష్బూ ను హీరోయిన్ గా పరిచయం చేశారు. అలాగే బొబ్బిలి రాజా సినిమాతో దివ్య‌భార‌తి టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. బొబిలి రాజా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అదే విధంగా సుంద‌ర‌కాండ సినిమాతో వెంక‌టేష్ అప‌ర్ణ ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక ల‌క్ష్మీ సినిమాతో వెంక‌టేష్ న‌య‌న‌తార‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారు. ప్రేమించుకుందారా సినిమాతో అంజ‌లీ జ‌వేరిని కూడా వెంక‌టేష్ ప‌రిచ‌యం చేశారు.

ఇవి కూడా చదవండి

కూలి నెంబర్ వన్ సినిమాతో టబును. సాహసవీరుడు సాగరకన్య సినిమాతో శిల్పాశెట్టి, ప్రేమంటే ఇదేరా సినిమాతో ప్రీతి జింత, ఇక నువ్వునాకు నచ్చావ్ సినిమాతో ఆర్తీఅగర్వాల్ ను.. అదే విధంగా తెలుగులో క‌త్రీనా కైఫ్ ను వెంకీ మ‌ళ్లీశ్వ‌రి సినిమాతో పరిచయం చేశారు. గురు సినిమాతో వెంకీ యంగ్ హీరోయిన్ రితికా సింగ్ ను ప‌రిచ‌యం చేశారు. ఇటీవల కాలంలో వెంక‌టేష్ న‌టించిన నార‌ప్ప‌, దృశ్యం, ఎఫ్ 2 సినిమాలు మంచి విజ‌యం సాధించాయి.