Devara : రిలీజ్‌కు ముందే దుమ్మురేపుతోన్న దేవర.. ప్రీ-బుకింగ్స్‌లో నయా రికార్డ్

|

Sep 18, 2024 | 7:00 AM

ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ కూడా నటిస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ప్రత్యేకంగా ఉండబోతోంది. ఇదేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ యాక్షన్-ప్యాక్డ్ డ్రామాలో ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, శృతి మరాఠే మరియు ఇతరులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Devara : రిలీజ్‌కు ముందే దుమ్మురేపుతోన్న దేవర.. ప్రీ-బుకింగ్స్‌లో నయా రికార్డ్
Devara
Follow us on

జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పార్ట్ వన్ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ కూడా నటిస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ప్రత్యేకంగా ఉండబోతోంది. ఇదేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ యాక్షన్-ప్యాక్డ్ డ్రామాలో ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, శృతి మరాఠే మరియు ఇతరులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే దేవర సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్, ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేశాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కు భారీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

తెలంగాణలో 1 గంట షోలు ప్లాన్ చేస్తున్నారు. ఈ షోలు సింగిల్ స్క్రీన్స్‌లో 1గంట షోలు వేస్తున్నారు, అయితే ఈ షోలు 15 స్క్రీన్‌లలో మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. అలాగే మల్టీప్లెక్స్‌లో ఉదయం 4 గంటల నుంచి షోలు ప్రారంభమవుతాయి. అయితే దీని పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమా దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిందని తెలుస్తోంది. అర్ధరాత్రి షో నిర్వహించడం వల్ల సినిమా వసూళ్లకు భారీగా పెరిగే అవకాశం ఉంది.

దేవర పార్ట్ వన్ పై ప్రేక్షకుల్లో చాలా క్రేజ్ ఉంది. చాలా చోట్ల దేవర అడ్వాన్స్ బుకింగ్స్  మొదలయ్యాయి. యూఎస్‌లో ఈ సినిమా కొత్త ట్రెండ్‌ని సెట్ చేసింది. ప్రీ-బుకింగ్ సేల్‌లో  దేవర 45,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. యుఎస్‌లో సినిమా అడ్వాన్స్ బుకింగ్ దేవర ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. సినిమా చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైందని పోస్ట్‌కు క్యాప్షన్‌లో రాశారు. పోస్ట్ ప్రకారం, ఈ చిత్రం విడుదలకు ముందే యుఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్‌లో రూ.14.65 కోట్లు రాబట్టింది. ఇఅలాగే దేవర సినిమా ఆస్ట్రేలియాలో ప్రీ-సేల్‌లో 56 లక్షల రూపాయలను దాటింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.