తమిళ్ స్టార్ డైరెక్టర్ లింగుసామీ (Director N Lingusamy) చిక్కుల్లో పడ్డారు. తమిళనాడులోని సైదాపేట కోర్టు అతనితోపాటు ఆయన సోదరుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. తన ప్రాజెక్ట్ కోసం తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించలేదని.. అలాగే అతను ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందని సదరు ప్రొడక్షన్ కంపెనీ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిపిన కోర్టు.. డైరెక్టర్ లింగుస్వామితోపాటు..అతని సోదరుడు సుభాష్ చంద్రకు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
తమిళ్ స్టార్ హీరో కార్తీ, సమంత జంటగా నటించిన యెన్ని ఏడు నాలుకుల్లా చిత్రాన్ని తెరకెక్కించేందుకు డైరెక్టర్ లింగుస్వామి పీవీపీ ప్రొడక్షన్ కంపెనీ నుంచి కొన్నే్ళ్ల క్రితం డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత తీసుకున్న అప్పును డైరెక్టర్ తీర్చలేదు. దీంతో అతనిపై సదరు కంపెనీ చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో లింగుస్వామి చెక్ పంపించగా.. అది కూడా బౌన్స్ అయ్యిందని సదరు కంపెనీని కోర్టును ఆశ్రయించారు. దాదాపు రూ. 1.03 కోట్ల విలువైన చెక్ బౌన్స్ అయినట్లుగా తెలుస్తోంది. సోమవారం విచారణ జరిపిన సైదాపేట కోర్టును ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే లింగుస్వామి, అతని సోదరుడు ఈ శిక్షపై అప్పీల్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
డైరెక్టర్ లింగుస్వామి ఇటీవలే ది వారియర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో టాలీవుడ్ ఎనర్జిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటించగా.. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.