టాలీవుడ్ లో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. అందమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల దిట్ట. అచ్చం మన పక్కన జరిగే కథలను సినిమాలు గా తెరకెక్కించి సక్సెస్ అయ్యారు శేఖర్ కమ్ముల. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల ఆ తర్వాత ఆనంద్, గోదావరి, లీడర్, ఫిదా లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు శేఖర్. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాతో టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఇక ఫిదా సినిమా ఎంత మంచి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రీసెంట్ గా లవ్ స్టోరీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శేఖర్. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక ఇప్పుడు శేఖర్ కమ్ముల తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మొన్నామధ్య ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా అనౌన్స్ చేశారు తప్పా ఇంతవరకు ఈ సినిమానుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఈ సినిమా కంటే ముందు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ధనుష్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు సార్ అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు.
అయితే ధనుష్ తో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న సినిమా ఆగిపోయిందని టాక్ వినిపించింది. ఒక భారీ పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా ఈ సినిమాను ప్లాన్ చేశారట శేఖర్ కమ్ముల. 1950 లో ఆంధ్రా, తమిళనాడు మధ్య ఉన్న సంబంధాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో తమిళ నాడులో ఉండే తెలుగు యువకుడుగా ధనుష్ కనిపించనున్నాడట. అయితే ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అందువల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్య అవుతోందని తెలుస్తోంది. అంతే కానీ ఈ సినిమా ఆఫీపోలేదట. వెంకీ అట్లూరి సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే శేఖర్ కమ్ముల సినిమా పట్టాలెక్కనుందట. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారట శేఖర్ కమ్ముల.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.