Salaar Part 1 : సలార్ సినిమానుంచి క్రేజీ అప్డేట్.. మొదటి సింగిల్ వచ్చేది అప్పుడే

ప్రభాస్ నటించిన సినిమాల్లో సాహూ, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అభిమానులను ఆశించిన  స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ సినిమా పైనే పెట్టుకున్నారు. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. కేజీఎఫ్ సినిమాను మించి ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.

Salaar Part 1 : సలార్ సినిమానుంచి క్రేజీ అప్డేట్.. మొదటి సింగిల్ వచ్చేది అప్పుడే
Salaar

Updated on: Dec 12, 2023 | 4:46 PM

ప్రభాస్ సలార్ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో సలార్ సినిమా ఒకటి. ప్రభాస్ నటించిన సినిమాల్లో సాహూ, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అభిమానులను ఆశించిన  స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ సినిమా పైనే పెట్టుకున్నారు. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. కేజీఎఫ్ సినిమాను మించి ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. సలార్ సినిమాను కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ మూవీ పై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. సలార్ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలైట్ గా ఉండనున్నాయని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే సలార్ సినిమానుంచి మరో ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే సలార్ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. సలార్ సినిమానుంచి మొదటి సాంగ్ ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సలార్ మూవీ నుంచి మొదటి సాంగ్ ను రేపు రిలీజ్ చేయనున్నారు.

ఈ మేరకు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. సలార్ సినిమా ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథ అని తెలుస్తోంది. మొన్నీమధ్య ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ఇద్దరు ప్రాణస్నేహితులు .. శత్రువులుగా మారుతారు అదే మా సలార్ సినిమా లైన్ అని చెప్పారు ప్రశాంత్ నీల్. దాంతో సలార్ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.