RRR: ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ రావడం పై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ్.. ఏమన్నారంటే

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడం పై సర్వత్రా చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

RRR: ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ రావడం పై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ్.. ఏమన్నారంటే
Tammareddy Bharadwaj

Updated on: Mar 13, 2023 | 4:59 PM

రాజమౌళి మనకు డైరెక్టర్‌ గానే తెలుసు.! అది సీరియల్స్ వల్ల అయితేనేమీ.. సినిమా వల్ల అయితేనేమీ! లెక్కల ప్రకారమే సినిమాలు తీస్తారని తెలుసు.. అది తన సినిమాల కలెక్షన్స్ వల్ల అయితే నేమీ.. కొట్టే రికార్డుల వల్ల అయితేనేమీ..
బుల్లి తెరమీద నంచి.. వెండితెర మీదికి వెళ్లిన జక్కన్న.. అక్కడ సెంట్ పర్సెంట్ సక్సెస్‌ సాధించారు. స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తనకే సాధ్యమైన లార్జన్ దెన్ లైఫ్ సినిమాలతో.. పాన్ ఇండియన్ డైరెక్టర్ గా నామ్ కమాయించారు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడం పై సర్వత్రా చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడం పై స్పందించారు.

అయితే తమ్మారెడ్డి మొన్నీమధ్య ఆర్ఆర్ఆర్ గురించి సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తుందని అన్నారు. దాదాపు 80 కోట్లు ఖర్చు చేస్తున్నారు ఆ డబ్బుతో పది సినిమాలు తీసి మొఖాన కొడతా అంటూ ఆయన కామెంట్స్ చేశారు.

ఇక ఇప్పుడు ఆస్కార్ రావడంతో ఆయన చిత్రయూనిట్ కు అబినందనలు తెలిపారు. ఆస్కార్ రావడం చాలా ఆనందంగా ఉందని.. తెలుగు ప్రజలందరికి ఇది గర్వకారణమని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.