Thalapathy Vijay: అయ్యో పాపం..! అభిమాననటుడి పుట్టిన రోజు వేళ అత్యుత్సాహంతో అపశృతి..

చాలామంది అభిమాన నటుడి పుట్టినరోజున రక్తదానాలు చేస్తారు, కేక్‌ కట్‌ చేస్తారు. కానీ చెన్నై నీలాంగరైలో మాత్రం ఓ గ్రూప్ ఏకంగా విన్యాసాలు నిర్వహించాలనుకుంది. నిప్పు అంటించుకున్న చేత్తో పెంకులు పగలకొట్టే ప్రయత్నం చేశాడో బాలుడు. పెంకులైతే పగిలాయి గానీ.. చేతికి అంటించుకున్న నిప్పు మాత్రం చల్లారలేదు. పైగా సుర్రెక్కింది. ఆ మంటలు కాస్తా స్టేజ్‌పై పడ్డాయి.

Thalapathy Vijay: అయ్యో పాపం..! అభిమాననటుడి పుట్టిన రోజు వేళ అత్యుత్సాహంతో అపశృతి..
Thalapathy Vijay

Updated on: Jun 22, 2024 | 4:21 PM

చూశారా ఈ దృశ్యం. చాలామంది అభిమాన నటుడి పుట్టినరోజున రక్తదానాలు చేస్తారు, కేక్‌ కట్‌ చేస్తారు. కానీ చెన్నై నీలాంగరైలో మాత్రం ఓ గ్రూప్ ఏకంగా విన్యాసాలు నిర్వహించాలనుకుంది. నిప్పు అంటించుకున్న చేత్తో పెంకులు పగలకొట్టే ప్రయత్నం చేశాడో బాలుడు. పెంకులైతే పగిలాయి గానీ.. చేతికి అంటించుకున్న నిప్పు మాత్రం చల్లారలేదు. పైగా సుర్రెక్కింది. ఆ మంటలు కాస్తా స్టేజ్‌పై పడ్డాయి. బాలుడి చేతికి మంటలు ఆర్పబోయిన మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. దళపతి విజయ్ పుట్టిన రోజు వేడుకలో ఈ అపశ్రుతి జరిగింది.