దళపతి విజయ్(Thalapathy Vijay)ప్రస్తుతం తెలుగులో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. తమిళనాట దళపతిగా అంతులేని అభిమానులను సొంతం చేసుకున్నాడు విజయ్. ఇక బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతోన్న దళపతి తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు వారసుడు అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను వంశీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారున్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఓ ప్రత్యేకత ఉంది. 1992 డిసెంబర్ లో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంటే ఈ డిసెంబర్ నాటికి హీరోగా విజయ్ ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు పూర్తవుతాయి. దాంతో వారసుడు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను డిసెంబర్ లో నిర్వహించాలని చూస్తున్నారు . అలాగే ఈ ఈవెంట్ కు స్టార్ హీరోలు అతిధులుగా రాబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి తమిళంలో ‘వరిసు’.. తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్స్‌ను సెట్ చేశారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.