
విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న లియో సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని కేవలం తమిళ ఆడియన్స్ మాత్రమే కాదు.. తెలుగులోనూ ఎదురు చూస్తున్నారు. దీనికి వస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ రెస్పాన్స్ చూస్తుంటేనే ఆ విషయం అర్థమైపోతుంది. మన దగ్గర కూడా విజయ్ ఫాలోయింగ్ బాగానే పెరిగిపోయిందని దీన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి ఈ సారి తమిళంలోనే కాదు.. తెలుగులోనూ భారీ ఓపెనింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్రతీసారి వేన్నీళ్లకు చన్నీళ్లలా తెలుగులో ఏదో అలా అలా ఓపెనింగ్స్ వచ్చేవి విజయ్ సినిమాలకు. కానీ ఈ సారి అలా కాదు.. భగవంత్ కేసరి లాంటి సినిమా ఎదురుగా ఉన్నా కూడా అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.
అసలు ఇది డబ్బింగ్ సినిమానేనా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి ఈ చిత్ర రేంజ్ చూస్తుంటే. ముఖ్యంగా హైదరాబాద్‌లో అయితే బాలయ్య కంటే ఎక్కువ ఓపెనింగ్స్ విజయ్ సినిమాకే వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇక కర్ణాటకలో చెప్పడానికి లేదు. అక్కడ తమిళనాడు, కర్ణాటక మధ్య నీటి కోసం యుద్ధాలు జరుగుతున్నా.. విజయ్ సినిమాకు మాత్రం ఎలాంటి సమస్యా లేదు. మరోవైపు తమిళంలో విజయ్ సెన్సేషనల్ రికార్డులకు సిద్ధం అవుతున్నాడు. జైలర్ పేరు మీదున్న 91 కోట్ల రికార్డ్ కూడా చెరిపేయడం ఖాయం అయిపోయింది లియో జోరు చూస్తుంటే. ఓవర్సీస్ నుంచే ఇప్పటికే 1 మిలియన్ దాటిపోయింది. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా అన్నిచోట్లా అరాచకం చేస్తుంది లియో. దాంతో ఓపెనింగ్స్ కూడా అలాగే ఉండబోతున్నాయని అర్థమవుతుంది.
ముఖ్యంగా మాస్టర్ తర్వాత లోకేష్, విజయ్ కాంబినేషన్ కావడం.. దానికితోడు విజయ్ ట్రాక్ రికార్డ్ అన్నీ లియోపై అంచనాలు పెంచేస్తున్నాయి. తెలుగులోనూ లియోని తక్కువంచనా వేయడానికి లేదు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ 215 కోట్ల వరకు జరిగిందని ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి. తెలుగు వర్షన్ వరకు 20 కోట్ల బిజినెస్ చేసింది లియో. లోకేష్ కనకరాజ్ దర్శకుడు కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్మెంట్స్ రిలీజ్ కావడంతో థియేటర్స్ బాగానే దొరికాయి. మొత్తానికి బాలయ్య, విజయ్ మధ్య అక్టోబర్ 19 సమరం ఆసక్తికరంగా ఉండబోతుంది. ఎలా చూసుకున్నా కూడా లియో ఫస్ట్ డే కలెక్షన్ అయితే 100 కోట్లు దాటడం ఖాయం.. అయితే ఆదిపురుష్ పేరు మీదున్న 137 కోట్లు చెరిపేస్తుందా.. లేదంటే పఠాన్ 105 కోట్లు, జవాన్ 127 కోట్ల దగ్గర ఆగుతుందా అనేది చూడాలిక.
Praveen Vadla- Author
#LeoFDFS @Dir_Lokesh @anirudhofficial @actorvijay #LeoFromToday pic.twitter.com/n895G0aob1
— LEO Movie (@LeoMovie2023) October 19, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి