Thalapathy Vijay: దళపతి విజయ్ చివరి సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్.. కొత్త పోస్టర్ అద్దిరిపోయిందిగా!

దళపతి విజయ్ 69వ చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. ఇప్పటికే రాజకీయాల్లో అడుగు పెట్టిన విజయ్ కు ఇదే చివరి సినిమా. తాజాగా ఈ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. సినిమా టైటిల్ పోస్టర్‌లో విజయ్ జనం మధ్యలో నిలబడి సెల్ఫీ తీసుకుంటున్నాడు. హెచ్. వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, అనిరుధ్ సంగీత దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని కెవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.

Thalapathy Vijay: దళపతి విజయ్ చివరి సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్.. కొత్త పోస్టర్ అద్దిరిపోయిందిగా!
Thalapathy Vijay

Updated on: Jan 26, 2025 | 4:42 PM

దళపతి విజయ్ చివరి సినిమా గురించి చాలా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా విజయ్ 69వ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో భిన్న రకాలుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ ప్రచారానికి తెరపడింది. దళపతి చివరి సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు సినిమా నిర్మాణ సంస్థ కెవీఎన్ ప్రొడక్షన్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘జన నాయగన్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సినిమా కొత్త పోస్టర్ లో దళపతి విజయ్ ఎక్కి నిలబడి సెల్ఫీ దిగాడు. ప్రజలు అతని చుట్టూ నిలబడి ఉన్నారు. ఈ పోస్టర్, టైటిల్ చూస్తుంటే ఇది రాజకీయ నేపథ్యంలో సాగే సినిమా అని అర్థమవుతోంది. దీనిపై అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. హెచ్. వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘కేవీఎన్‌ ప్రొడక్షన్‌’ పతాకంపై వెంకట్ నారాయణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కె వెంకట్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

విజయ్ చివరి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజకీయ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మరింత క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా వెల్లడి కాలేదు. దళపతి 69 ఈ స్టార్ మోస్ట్ హిట్ సినిమాగా నిలిచి 1000 కోట్లు రాబట్టగలదని విజయ్ అభిమానులు ఆశిస్తున్నారు. అన్ని రకాల ఎమోషనల్‌ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందిందని సమాచారం. నటీనటుల ఎంపిక కూడా అలానే ఉందని సమాచారం.

ఇవి కూడా చదవండి

దళపతి విజయ్ సినిమా బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ గా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాజల్ అగర్వాల్, శ్రీలీల హీరోయిన్లు గా నటించారు.

దళపతి విజయ్ సినిమా కొత్త పోస్టర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.