Beast movie : తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ కు తెలుగు లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. విజయ్ నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాలను సాధిస్తుంటాయ్. గత కొంతకాలంగా విజయ్ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే.. ప్రతి సినిమా 100కోట్ల మార్క్ ను చాలా సింపుల్ గా క్రాస్ చేసేశాయి. ఇక రీసెంట్ గా వచ్చిన మాస్టర్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు విజయ్ బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాలంటైన్స్‌డేను పురస్కరించుకొని బీస్ట్ సినిమాలోని ‘అరబికుత్తు’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
‘అరబికుత్తు’ సాంగ్ రిలీజ్ చేసిన 24 గంటల్లో యూట్యూబ్‌లో అత్యధికమంది వీక్షకులు వీక్షించిన పాటగా రికార్డు సృష్టించింది. ఇప్పటికీ ఈసాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికి ఈ పాట 200 మిలియాన్ వ్యూస్ దక్కాయి. విజయ్ బీస్ట్ నుంచి మరో క్లాసీ నంబర్ విడుదలైంది. జాలీ వో జింఖానా అంటూ సాగే ఈ పాట ఆద్యంతం అనిరుధ్ మార్క్ మ్యూజిక్ అలరించింది. మెస్మరైజ్ చేసే డ్యాన్సింగులతో దళపతి మార్క్ సిగ్నేచర్ స్టెప్పులతో వైబ్రేంట్ గా కనిపిస్తోంది. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది.
మరిన్ని ఇక్కడ చదవండి :