‘అమ్మ’ పాత్రలో అచ్చుగుద్దినట్టుగా..

|

Nov 23, 2019 | 6:08 PM

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్.. జయ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి ‘తలైవి’ పేరును ఖరారు చేశారు. ఇటీవలే ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఏఎల్ విజ‌య్ దర్శకుడు. ఇప్పటికే బయోపిక్‌కి సంబంధించిన నటీనటుల సెలక్షన్ దాదాపు పూర్తయ్యింది. ఎంజీఆర్‌ పాత్రలో అర‌వింద‌స్వామి,  క‌రుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించనున్నారు. ఇక అన్న ఎన్టీఆర్ పాత్రలో టాలీవుడ్ టాప్ హీరో బాలకృష్ణను […]

అమ్మ పాత్రలో అచ్చుగుద్దినట్టుగా..
Follow us on

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్.. జయ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి ‘తలైవి’ పేరును ఖరారు చేశారు. ఇటీవలే ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఏఎల్ విజ‌య్ దర్శకుడు. ఇప్పటికే బయోపిక్‌కి సంబంధించిన నటీనటుల సెలక్షన్ దాదాపు పూర్తయ్యింది. ఎంజీఆర్‌ పాత్రలో అర‌వింద‌స్వామి,  క‌రుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించనున్నారు. ఇక అన్న ఎన్టీఆర్ పాత్రలో టాలీవుడ్ టాప్ హీరో బాలకృష్ణను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

తాజాగా కంగనా రనౌత్..అమ్మ వేషధారణలో ఉన్న ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను, టీజర్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. టీజర్‌లో జయలలిత ఏజ్‌లో హీరోయిన్‌గా ఉన్నప్పటి లుక్‌ని, రాజకీయాలలోకి వచ్చాక లుక్‌ని రెండింటిని రివీల్ చేశారు. హాలీవుడ్ ఏస్ మేక‌ప్ ఆర్టిస్ట్.. కంగ‌నా ర‌నౌత్‌ను జ‌య‌ల‌లిత‌గా దాదాపు చూపించే ప్రయత్నం చేశారు. తమిళనాట కంగనా లుక్‌కి మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది. కొంతమంది బాగుందని ప్రశంసిస్తుండగా, మరికొందరు ఫేక్ లక్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా చిత్రానికి రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ అందించడం విశేషం. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ సంయుక్తంగా జయలలిత బయోపిక్‌ని నిర్మిస్తున్నారు.