
సీరియల్స్ చేస్తున్నాడు.! సినిమాల్లో చిన్నా చితకా క్యారెక్టర్స్ కూడా చేస్తున్నాడు. మరి ఇంకే తలబిరుసు రానే వచ్చింది. తనో స్టార్ అనే ఫీలింగ్ నెత్తి మీదికెక్కి మరీ నాట్యం చేసింది. కష్టపడి పెంచిన.. కండలు తిరిగిన బాడీని అందరికీ చూపించాలనే థాట్ వచ్చింది. అంతే..! ఓ షూట్లో అసిస్టెంట్ డైరెక్టర్ పై దాడికి దిగాడు. ఓ రెండు మూడు సార్లు పిలిచినందుకే చెంప చెడేల్ మనిపించాడు. ఇది కన్నడ నటుడు చందన్(Chandan Kumar )గురించి రెండు రోజుల క్రితం బయటకు వచ్చిన నిర్వాకం. అయితే ఈయన నిర్వాకానికి ఆ షూట్లోనే బదులిచ్చారు అక్కడున్న అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ టెక్నీషియన్స్. ఓవర్ యాక్టింగ్ చేసిన ఈ నటుడ్ని కొట్టేంత పని చేశారు. చిన్నగా కొట్టారు కూడా..! అయితే ఈ ఘటనను తన వైపుకు మార్చుకునే ప్రయత్నం చేశారు. తాను చేయిచేసుకున్న అసిస్టెంట్ డైరెక్టర్కు సారి చెప్పమంటే.. చెప్పకపోగా.. తెలుగు వారు.. కన్నడ వారిని చీప్ గా చూస్తున్నారంటూ.. కన్నడ మీడియా ముందు కామెంట్లు చేశారు. తనకు సానుభూతి దక్కేలా చేసుకున్నాడు.
ఇక ఈ సీన్‌తో రంగంలోకి దిగిన తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ చందన్ కామెంట్స్ ను తిప్పికొట్టింది. తెలుగు వారికి ప్రాంతీయాభిప్రాయాలు లేవని.. అందుకే 60 సీరియల్స్‌లో 240 కన్నడ నటీనటులు పనిచేస్తున్నారంటూ..చెప్పింది. అంతేకాదు తెలుగు టెక్నీషియన్లకు టాలెంట్ లేదన్న చందన్ మాటను గట్టిగా తిప్పికొట్టింది. టాలెంట్ లేకపోతేనే.. రాజమౌళి, పూరీ, చోటా టీవీ స్థాయి నుంచి సినిమాల్లో ఎదిగారా అంటూ.. అతడని ప్రశ్నించింది. అంతేకాదు చందన్ గతంలో చాలా సార్లు ఇలానే బిహేవ్ చేశాడని.. కాని నటుడు కదాని … తామే వదిలేశామని గుట్టు రట్టు చేసింది తెలుగు ఫెడరేషన్.