‘ఆ వ్యాఖ్యలతో మాకు ఎలాంటి సంబంధం లేదు’.. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ స్టేట్మెంట్..

|

Sep 26, 2021 | 8:18 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు ఏపీలో ఇటు ఫిలిం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.. రిపబ్లిక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి.

ఆ వ్యాఖ్యలతో మాకు ఎలాంటి సంబంధం లేదు.. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ స్టేట్మెంట్..
Pawan
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు ఏపీలో ఇటు ఫిలిం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. ఈ వ్యవహారం కాస్తా ఏపీ ప్రభుత్వం వర్సెస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా మారుతోంది. పలువురు హీరోలు పవన్‌కు మద్దతుగా ట్వీట్లు వేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారం పై  తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ స్పంధించింది.. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. కొంతమంది తమ అభిప్రాయాలను, ఆక్రోశాన్ని వెల్లడించారు.. అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే అని అందులో పేర్కొన్నారు. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ అభిప్రాయాలుగా వాటిని చూడకూడదు.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రమే..రెండు రాష్ట్రాల్లో సినీ ఇండస్ట్రీకి ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రభుత్వాల నుంచి ఎప్పుడూ ఇండస్ట్రీకి సహకారం అందుతూనే ఉంది. ప్రభుత్వాల సహకారం లేకుండా మేం మనుగడ సాగించలేం అని తెలిపారు.

ఇండస్ట్రీ పై ఆధారపడ్డ వేలాది కుటుంబాలు కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ సమయంలో మాకు రెండు ప్రభుత్వాల సహకారం ఎంతో అవసరం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇండస్ట్రీకి రెండు కళ్లు వంటి వారు
సినీ ఇండస్ట్రీకి వారి ఆశీస్సులు, మద్దతును కోరుకుంటున్నాం అంటూ తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణదాస్ నారంగ్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పనితీరుపై మండిపడ్డారు. తన మీద ఉన్న కోపంతో సినిమా పరిశ్రమను ఇబ్బంది పెడుతున్నారంటూ విరుచుకుపడ్డారు..

మరిన్ని ఇక్కడ చదవండి : 

R. Madhavan : రాకెట్రీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మాధవన్.. సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడేనట..

Natural Star Nani : సీఎం జగన్‌కు హీరో నాని రిక్వెస్ట్.. పవన్ కళ్యాణ్‌కు థాంక్స్..

Mahesh Babu : వెబ్ సిరీస్ చేసే ఆలోచన ఉందా..? క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్..