కేసీఆర్ (కేశవ చంద్ర రమవత్) సినిమా హీరో,నిర్మాత రాకింగ్ రాకేష్ నిర్మించిన తెలంగాణ తేజం పాటను నంది నగర్ లోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు చరణ్ అర్జున్,యాంకర్ జోర్ధార్ సుజాత,సింగర్ విహ,గీత రచయిత సంజయ్ మహేష్ లు , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకేష్ హీరోగా ఈ సినిమా రూపొందుతుంది. నిర్మాతగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. కెసిఆర్ మీద ఉన్న అభిమానంతోనే ఆయన పేరుతో ఈ టైటిల్ రిజిస్టర్ చేస్తున్నట్లుగా రాకేష్ తెలిపారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ మినహా సినిమా మొత్తం పూర్తయింది. అయితే కెసిఆర్ పేరుతో టైటిల్ మాత్రమే ఉందా లేదంటే కేసీఆర్ జీవిత విశేషాలు ఏమైనా ఈ సినిమాలో చూపించబోతున్నారా అనేది ఆసక్తిగా మారింది.