‘కమిట్మెంట్’..ఈ పదం బయట ఏదైనా పనిలో నిబద్దత గురించి వినియోగిస్తారు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం ఈ పేరుకు సెపరేట్ లెక్క ఉంది. సినిమాలో అవకాశం ఇచ్చినందుకు గానూ సదరు నటి..ఆ మూవీ టీంలో వారికి లైంగికంగా లొంగిపోవాల్సి ఉంటుంది. దీనికి ‘కమిట్మెంట్’ అనే పేరు పెట్టింది మూవీ ఇండస్ట్రీ. ఇప్పటికే చాలామంది నటీమణులు బయటకు వచ్చి ఈ ఇష్యూపై తమ వాయిస్‌ను వినిపిస్తున్నారు. ఇప్పుడు ఓ బ్యూటీ కూడా ఈ ఇష్యూపై కదం తొక్కడానికి సిద్దమైంది.
తేజస్వీ మదివాడ..చాలా తక్కువ టైంలో ఫేమ్ సంపాదించిన ఈ నటి..పటాపట్‌గా మూవీస్ చేసింది. కానీ అవి అంతగా ప్రజాదారణ పొందలేదు. దీంతో ప్రస్తుతం అమ్మడు అవకాశాలు లేక వెలవెలబోతోంది. అందుకే.. ‘కమిట్మెంట్’ గురించి చెప్పి ఇండస్ట్రీ అటెన్షన్‌ను తన వైపుకు తిప్పుకోడానికి సిద్దమైంది. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదు..రీల్ లైఫ్‌లో.
అవును ‘కమిట్మెంట్’ అనే పేరుతో త్వరలోనే ఓ మూవీ తెరకెక్కనుంది. దీంట్లో సినిమాల్లో నటించాలని ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కుంటారో, క్లియర్ చూపించబోతున్నారని టాక్. కొందరు హీరోలు, నిర్మాతలు, దర్శకులు..అమ్మాయిలపై చేసే దాష్టీకాలను ఈ సినిమాలో ప్రస్తావించబోతున్నట్టు తెలుస్తోంది. “హైదరాబాద్ నవాబ్స్” ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
తేజస్వి బిగ్ బాస్ 2 లో భాగమైనప్పటికీ, అంతగా ఫేమ్ రాలేదు. హౌజ్ లోపల ఆమె చేసిన చర్యలు అమ్మడికి నెగటీవ్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టాయి. అలాగే, బ్రహ్మానందం జడ్జ్‌గా, తేజస్వీ హోస్ట్‌గా చేసిన కామెడీ షో క్లిక్ కూడా క్లిక్ అవ్వకపోవడంతో యాంకర్‌గా కూడా ఈ బ్యూటీకి అవకాశాలు రాలేదు. దీంతో అటెన్షన్ గ్రాబ్ చెయ్యడానికే అమ్మడు ఈ బోల్డ్ సినిమాను ఓకే చేసినట్టు సమాచారం.