
చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోలుగా హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. తేజ సజ్జ, కావ్య కళ్యాణ్ రామ్, నిత్యా శర్మ ఇలా చాలా మంది ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నారు. అలాంటి వారిలో తేజస్వి మదివాడ ఒకరు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఫెమస్ అయిన తేజస్వి మదివాడ. ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో సోలో హీరోయిన్ గా నటించినా, ఆ తర్వాత సెకెండ్ ఫీమెల్ లీడ్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువగా కనిపించింది. బిగ్ బాస్ హౌజ్ లో లో అడుగు పెట్టి బుల్లితెర ఆడియెన్స్ కు చేరువైన తేజస్వి మదివాడ ప్రస్తుతం టీవీ షోలతో బిజీబిజీగా ఉంటోంది.
అలాగే పలు సినిమా ఫంక్షన్లలోనూ సందడి చేస్తోంటోంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అమ్మడు. ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. నిత్యం తన లేటెస్ట్ క్రేజీ ఫొటోస్, వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటోంది. అయితే ప్రస్తుతం తేజస్వి మదివాడ సినిమాల స్పీడ్ తగ్గిచింది. కొన్ని వెబ్ సిరీస్ ల్లో నటిస్తుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది. పలు టీవీ షోల్లోనూ పాల్గొంటుంది.
తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న తేజస్వి మదివాడ ఎమోషనల్ అయ్యింది. చిన్న తనంలోనే తల్లి చనిపోయిందని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం తేజస్వి కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే టీవీ షోలో చేస్తుంది. ఈ షోలో ఫ్యామిలీ థీమ్ ఎపిసోడ్ షూట్ చేశారు. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ” నాకు పదేళ్ల వయసులోనే మా అమ్మ చనిపోయారు. మా నాన్న మమ్మల్ని పట్టించుకోలేదు . దాంతో నేను 18 ఏళ్ళప్పుడు ఇంట్లోంచి బయటికి వచ్చేసాను. ఆతర్వాత రోహిత్ భరద్వాజ్ ఫ్యామిలీ నన్ను చూసుకుంటుంది. నేను ఎప్పుడూ జనాల్లో ఉండటానికి ఇష్టపడతాను. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవుతుంటా.. షూటింగ్ సెట్ కు వస్తే నాకు ఓ పండగలా ఉంటుంది అని కన్నీళ్లు పెట్టుకుంది తేజస్వి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.