Tollywood: ఒకే ఏడాది 3 భారీ సీక్వెల్స్.. అరుదైన రికార్డు సృష్టించబోతున్న యంగ్​ హీరో!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక యువ హీరో పేరు మార్మోగిపోతోంది. ఏ విధమైన సినీ నేపథ్యం లేకుండా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి, నేడు పాన్ ఇండియా లెవల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2024లో ఒక చిన్న సినిమాగా వచ్చి వెయ్యి కోట్ల వసూళ్లకు చేరువైన ఆ సినిమాతో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ అయిపోయాడు.

Tollywood: ఒకే ఏడాది 3 భారీ సీక్వెల్స్.. అరుదైన రికార్డు సృష్టించబోతున్న యంగ్​ హీరో!
Young Heroo

Updated on: Jan 25, 2026 | 6:15 AM

తాజాగా ఈ ఏడాది కూడా ఒక భారీ యాక్షన్ డ్రామాతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాడు. అయితే వచ్చే ఏడాది అంటే 2026లో ఈ హీరో నుండి ఏ సినిమా రాకపోయినా, 2027లో మాత్రం ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. టాలీవుడ్ లో ఏ అగ్ర హీరోకు కూడా సాధ్యం కాని రీతిలో, ఒకే ఏడాది ఏకంగా మూడు భారీ సీక్వెల్స్ తో థియేటర్లను దద్దరిల్లేలా చేయబోతున్నాడు. ఆ అరుదైన రికార్డు సృష్టించబోతున్న ఆ యంగ్ సూపర్ స్టార్ ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.. ఆయనే తేజా సజ్జా. మరి ఆ మూడు సీక్వెల్స్ ఏంటి?

2027లో తేజా సజ్జా దూకుడు..

వచ్చే ఏడాది బాక్సాఫీస్ వద్ద బడా ప్రాజెక్టుల సందడి ఉండబోతోంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ల సినిమాలు 2027కి షిఫ్ట్ అవ్వడంతో పోటీ తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో తేజా సజ్జా తన సినిమాలతో సవాల్ విసిరేందుకు రెడీ అవుతున్నాడు. 2024లో ‘హనుమాన్’ తో, 2025లో ‘మిరాయ్’ తో బ్లాక్ బస్టర్లు కొట్టిన సజ్జా, ఇప్పుడు తన సినిమాల సీక్వెల్స్ పై ఫోకస్ పెట్టాడు.

వరుస సీక్వెల్స్​..

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఫస్ట్ తెలుగు జాంబీ మూవీ ‘జాంబీ రెడ్డి’ అప్పట్లో ఒక సంచలనం. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ‘జాంబీ రెడ్డి 2’ రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే వేసవిలో మొదలవ్వనుంది. 2027 జనవరిలోనే ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ త్వరలోనే రానుంది.

Young Hero Teja Sajja

‘మిరాయ్ 2’

ఈ ఏడాది విడుదలై మంచి విజయం సాధించిన ‘మిరాయ్’ కి కూడా సీక్వెల్ సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆగస్టులో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ భారీ బడ్జెట్ అడ్వెంచర్ మూవీని 2027 చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ‘జై హనుమాన్’. ఇందులో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపిస్తుండగా, తేజా సజ్జా తన హనుమాన్ పాత్రలో గెస్ట్ రోల్ లో మెరవబోతున్నాడు. ఈ సినిమా కూడా 2027లోనే సందడి చేయనుంది. ఇలా ఒకే ఏడాది వరుసగా మూడు సీక్వెల్స్ తో రావడం అనేది ఇండియన్ సినిమాలోనే ఒక అరుదైన రికార్డుగా నిలిచిపోనుంది.

ఒకే హీరో వరుసగా మూడు సీక్వెల్స్ చేయడమే కాకుండా, వాటిని ఒకే ఏడాది విడుదల చేయడం అంటే మామూలు విషయం కాదు. తేజా సజ్జా ప్లానింగ్ చూస్తుంటే 2027 బాక్సాఫీస్ వద్ద ఆయన హవా గట్టిగా ఉంటుందని అర్థమవుతోంది. హనుమాన్ మేనియాతో మొదలైన ఈ ప్రయాణం 2027లో ఎటువంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.