Good Night Movie OTT: ఓటీటీలోకి కామెడీ ఎంటర్టైనర్.. తెలుగులో స్ట్రీమింగ్ కానున్న ‘గుడ్ నైట్’ మూవీ..

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. జూలై 3 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లా్ట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళంతోపాటు.. తెలుగు, కన్నడ, మలయాళంలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈసినిమాను మరోసారి చూసి ఎంజాయ్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Good Night Movie OTT: ఓటీటీలోకి కామెడీ ఎంటర్టైనర్.. తెలుగులో స్ట్రీమింగ్ కానున్న గుడ్ నైట్ మూవీ..
Good Night

Updated on: Jun 22, 2023 | 3:23 PM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ముఖ్యంగా భారీ తారగణం, ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. దీంతో మిగతా భాషలలోకి సైతం ఈ చిత్రాలను డబ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కాంతార, జయ జయ జయహే, రొమాంచమ్ చిత్రాలు తమిళం, మలయాళంలో సూపర్ హిట్ అయ్యి తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సూపర్ హిట్ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దమయ్యింది. అదే ‘గుడ్ నైట్’ సినిమా. మనందరికీ తెలిసిన గురక అనే సమస్య ఆధారంగా ఈ సినిమాను రూపొందించగా.. అద్భుతమైన విజయం అందుకుంది.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. జూలై 3 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లా్ట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళంతోపాటు.. తెలుగు, కన్నడ, మలయాళంలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈసినిమాను మరోసారి చూసి ఎంజాయ్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాకు తమిళ్ డైరెక్టర్ వినాయక్ చంద్రశేఖరన్ దర్శకత్వం వహించారు.

ఇక కథ విషయానికి వస్తే..
ఈ సినిమాలో హీరోకు గురక సమస్య ఉంటుంది. అతను తన అక్కా బావతో కలిసి ఉంటాడు. అయితే తనకున్న గురక సమస్య కారణంగా రోజూ ఒకరితోనైనా తిట్లు తింటూనే ఉంటాడు. అలా సాగిపోతున్న అతని జీవితంలోకి ఓ అమ్మాయి వస్తుంది. స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లితో ఒక్కటవుతారు. అయితే కొన్నాళ్లకు తన గురక సమస్య ఆ అమ్మాయి ముందు బయటపడుతుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి అదే సినిమా. ఈ మూవీలో మణికందన్,మీరా రఘునాథ్ హీరోహీరోయిన్లుగా నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.