Prabhudeva, Dhanush: ప్రభుదేవాతో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన ధనుష్.. వీడియో వైరల్

ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. నటుడిగానే కాదు దర్శకుడిగానూ దూసుకుపోతున్నాడు ధనుష్. రీసెంట్ గానే ధనుష్ దర్శకత్వంలో వచ్చిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

Prabhudeva, Dhanush: ప్రభుదేవాతో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన ధనుష్.. వీడియో వైరల్
Danush, Prabhudeva

Updated on: Feb 24, 2025 | 7:16 AM

ప్రభుదేవా.. నటుడిగా కొరియోగ్రాఫ్ గా, దర్శకుడుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు . ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కు ప్రభుదేవా కొరియోగ్రాఫ్ చేశారు. అలాగే దర్శకుడిగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా  లాంటి బ్లాక్ బస్టర్ మూవీ  చేసింది. అలాగే తెలుగు తమిళ్   హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే హిందీ సినిమా బాదాస్ రవి కుమార్ ప్రధాన పాత్రలో ఓ సినిమా  చేశాడు. తాజాగా ఓ చెన్నైలో ఒక ఇంటర్ నేషనల్ ప్రోగ్రాంలో చేశారు. ఈ షోకి నటులు ధనుష్, వడివేలు, ఎస్.జె. ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సూర్య, దర్శకుడు శంకర్ సహా పలువురు సినీ ప్రముఖులుకూడా హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో నటుడు ప్రభుదేవా “ఊర్వశి ఊర్వశి” పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు.

దీని తరువాత, ధనుష్ , ప్రభుదేవా కలిసి “రౌడీ బేబీ” పాటకు స్టెప్పులేశారు. ఈ వీడియో, అలాగే నటుడు ధనుష్ వేదికపై మాట్లాడుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. 2018లో విడుదలైన మారి 2 చిత్రం ధనుష్, సాయి పల్లవి జంటగా నటించారు. ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి విడుదలైన భారీ హిట్ పాట రౌడీ బేబీ. ఈ పాటలో నటుడు ధనుష్, సాయి పల్లవి అద్భుతంగా డాన్స్ చేశారు.

ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. ఫిబ్రవరి 22, 2025న చెన్నైలో జరిగిన డాన్స్ షోలో ధనుష్ ప్రభుదేవాతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ముందు, నటి శరణ్య పొన్వన్నన్‌తో కలిసి నటుడు ధనుష్ డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా వైరల్ కావడం గమనార్హం. ధనుష్ రీసెంట్ గా తాను దర్శకత్వం వహించిన నిలవుక్కు ఎన్ మేల్ ఎనాది కోపం చిత్రం తర్వాత ఇడ్లీ కడై చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇడ్లీ కడై సినిమాలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత, దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘కుబేర’ అనే తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నాడు. అతను హిందీ చిత్రం తేరే ఇష్క్ మే లో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తర్వాత, ఆయన దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించే D55 చిత్రంలో కూడా నటిస్తారని చెబుతున్నారు. హాలీవుడ్‌లో కూడా ఆయన ఓ సినిమాలో నటిస్తారని చెబుతున్నారు ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ధనుష్.

సోర్స్ Tv9 తమిళ్ (Viral Video : “ரவுடி பேபி” பாடலுக்கு பிரபுதேவாவுடன் நடனமாடிய தனுஷ்!)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.