Tamil Actors: రూట్ మార్చేశారు.. తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్న త‌మిళ హీరోలు

ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమానే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అన్న స్థాయికి వచ్చింది. సో.. పరభాషా...

Tamil Actors: రూట్ మార్చేశారు.. తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్న త‌మిళ హీరోలు
Tamil Heros

Updated on: Jun 20, 2021 | 1:05 PM

ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమానే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అన్న స్థాయికి వచ్చింది. సో.. పరభాషా హీరోలు కూడా తెలుగు సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కోలీవుడ్ టాప్ హీరో విజయ్‌ కూడా స్ట్రయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేస్తున్నారు విజయ్‌. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్న ఈ మూవీ విజయ్‌కి ఫస్ట్ స్ట్రయిట్ తెలుగు మూవీ. రీసెంట్ గా సూర్య కూడా తెలుగు సినిమాకు రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మాస్ యాక్షన్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట సూర్య. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించేందుకు రెడీ అవుతున్నారు.

యంగ్ హీరో కార్తీ కూడా తెలుగు సినిమాల మీద స్పెషల్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఊపిరి సినిమాలో నాగ్‌తో కలిసి నటించిన కార్తీ… సోలో హీరోగానూ స్ట్రయిట్ తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ ఓన్‌ డబ్బింగ్‌తో మెప్పిస్తున్న ఈ క్రేజీ స్టార్‌.. త్వరలోనే డైరెక్ట్‌ మూవీతో మెప్పిస్తానంటున్నారు. డబ్బింగ్ సినిమాలతోనే టాలీవుడ్‌లో క్రేజ్ సొంతం చేసుకున్న ధనుష్ ఇప్పుడు కాఫీ లాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్‌ ఎనౌన్స్‌ మెంట్ కూడా వచ్చేసింది. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఓకే సారి ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు.

Also Read: సౌత్‌లో మాస్ట‌ర్ చెఫ్ హోస్ట్ చేయ‌బోతున్న స్టార్లు వీరే…

పాన్ ఇండియా ట్రెండ్‌లోనే సరికొత్త వెర్షన్‌… శేఖర్ కమ్ముల అండ్ ధనుష్ చేస్తున్న డ్యూయల్ ఎఫర్ట్‌