తమిళ్ స్టార్ హీరో విశాల్ (Vishal) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ విశాల్‌కు క్రేజ్ ఎక్కువగానే ఉంది. అతను నటించిన తమిళ్ చిత్రాలు తెలుగులోకి డబ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం విశాల్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతుండడం.. రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు పాటించడం ఇతర హీరోల మాదిరిగానే విశాల్ చిత్రాలకు కూడా అడ్డు పడింది. దీంతో విశాల్ నటించిన లేటేస్ట్ చిత్రాలు వాయిదా పడుతూనే ఉన్నాయి.
సరికొత్త కథలను తెరపైకి తీసుకొస్తూ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుంటారు కోలీవుడ్ స్టార్ విశాల్. ఈ క్రమంలోనే ఆయన కొత్త సినిమా ‘సామాన్యుడు’ ఓ యూనిక్ కంటెంట్‌తో తెరకెక్కింది. డెబ్యూ డైరెక్టర్ తు ప శరవణన్ రూపొందించిన ఈ యాక్షన్ డ్రామా ఫిబ్రవరి 4 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమాను విశాల్ నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్ చూస్తే.. ఫుల్ యాక్షన్ మోడ్లో ‘సామాన్యుడు’ సినిమా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. అలాగే సెకండ్ సాంగ్ ‘మత్తెక్కించే’ కు కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. విశాల్ సరసన డింపుల్ హయతి నాయికగా నటించారు. కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ‘సామాన్యుడు’ సినిమాను టెక్నికల్ గా స్ట్రాంగ్ గా మార్చేశాయి. యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా తులసి, రవీనా రవి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 4 న విడుదల కానుంది.
Also Read: Anupama Parameshwaran: నెట్టింట్లో అనుపమ రచ్చ.. రాత్రి అంటే వైన్ ఉండాల్సిందేనంటున్న హీరోయిన్..
Bhala Thandanana: యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది ‘భళా తందనాన’ టీజర్
Puneeth Rajkumar: తమ్ముడి చివరి సినిమాకు డబ్బింగ్ చెప్తూ కన్నీళ్లు పెట్టున్న శివన్న..
Lata Mangeshkar: కోలుకుంటున్న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. మంత్రి ఏమన్నారంటే..?