Beast Twitter Review: విజయ్ బీస్ట్ సినిమా ట్విట్టర్ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించినట్టేనా ?

|

Apr 13, 2022 | 8:49 AM

తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy) నటించిన లేటేస్ట్ చిత్రం బీస్ట్ (Beast). ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా..

Beast Twitter Review: విజయ్ బీస్ట్ సినిమా ట్విట్టర్ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించినట్టేనా ?
Beast
Follow us on

తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy) నటించిన లేటేస్ట్ చిత్రం బీస్ట్ (Beast). ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అరబిక్ కుతు సాంగ్ యూట్యూబ్‏ను షేక్ చేస్తోంది. ఈ పాటకు చిన్నా, పెద్ద స్టెప్పులేస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. మరోవైపు.. ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్.. బీస్ట్ చిత్రంపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమా కోసం దళపతి ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి తమిళ సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్ 13న ఈ సినిమాను ఘనంగా విడుదల చేశారు. ఈ సినిమాను ఇప్పటికే వీక్షించిన దళపతి ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

చెన్నైలోని ఓ మాల్ ని టెర్రరిస్ట్ లు హైజాక్ చేయగా.. ఆ తీవ్రవాదుల బారి నుంచి ప్రజలను రక్షించి తీసుకుని రావడానికి సోల్జర్ వీర రాఘవన్‏గా దళపతి రంగంలోకి దిగుతాడు. ఆ నేపథ్యంలో చోటుచేసుకునే యాక్షన్ సీన్స్… మాజీ రా ఏజెంట్ గా విజయ్ ఆ మాల్ లోని జనాలను ఎలా రక్షిస్తాడు అనేది కథాంశంగా తెలుస్తోంది. ఇక తమిళంలోనే కాకుండా.. విజయ్‏కు తెలుగులోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే విజయ్ నటించిన చిత్రాలు తెలుగులో డబ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా విడుదలైన బీస్ట్ చిత్రంపై.. తమిళ్, తెలుగు ప్రేక్షకులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అల్ట్రా మాస్ ఫెర్మామెన్స్‏తో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, విజయ్ దళపతి ఈ మూవీని ముందుకు తీసుకెళ్లారని.. కామెడీ, యాక్షన్ సీన్స్ బాగున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Sanjay Dutt: ఆలియా, రణబీర్ కపూర్ పిల్లల కోసం చూస్తున్నాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన సంజయ్ దత్..

Anil Ravipudi: సరికొత్త లుక్‏లో బాలకృష్ణను చూపించబోతున్నాను.. ఆసక్తికర విషయాలను చెప్పిన డైరెక్టర్ అనిల్ రావిపూడి..

Prashanth Neel : సలార్ సిక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. గట్టిగా చెప్పేస్తానంటూ..

Hair Care Tips: జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా..? ఉసిరితో శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు..