Sir Trailer: వెలకట్టలేని సంపద చదువు.. విద్యార్థుల కోసం ‘సార్’ పోరాటం.. ధనుష్ సినిమా ట్రైలర్ అదిరిపోయింది..

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఇటీవల విడుదల అయిన ‘మాస్టారు మాస్టారు‘ గీతం 'సార్‘ పై ప్రపంచ సినిమా వీక్షకులలో అమితాసక్తి కలిగించాయి.

Sir Trailer: వెలకట్టలేని సంపద చదువు.. విద్యార్థుల కోసం సార్ పోరాటం.. ధనుష్ సినిమా ట్రైలర్ అదిరిపోయింది..
Sir

Updated on: Feb 08, 2023 | 7:44 PM

తమిళ్ స్టార్ హీరో ధనుష్‏కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. రాఘువరన్ బీటెక్ సినిమాతో ఈ హీరోకు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఆయన నటిస్తోన్న సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో ధనుష్ నేరుగా తెలుగులో నటిస్తోన్న సినిమా సార్. ఈ చిత్రానికి డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను తమిళంలో వాతి పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇక తెలుగులో సార్ టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. ఇందులో ధనుష్ ఉపాధ్యాయుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఇటీవల విడుదల అయిన ‘మాస్టారు మాస్టారు‘ గీతం ‘సార్‘ పై ప్రపంచ సినిమా వీక్షకులలో అమితాసక్తి కలిగించాయి.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. విద్యావ్యవస్థ తీరు తెన్నుల మీదుగా కథానాయకుడు సాగించే ప్రయాణం అందులోని సమస్యలు, సంఘటనలు ‘సార్’ జీవితాన్ని ఏ తీరానికి చేర్చాయన్నది. చదువు కోసం విద్యార్థుల ఆరాటం. ఇందులోని డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 17, 2023 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఇందులో ధనుష్ సరసన భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ నటిస్తోంది. అలాగే సాయికుమార్, తనికెళ్ల భ‌ర‌ణి, సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.