AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అందరూ యూనిఫామ్‌లో ఉంటే.. ఈ కుర్రాడు మాత్రం సివిల్‌లో.. ఇప్పుడు తెలుగులో మస్త్ మాస్ హీరో

రెడ్ బుల్ తాగినట్లు ఎప్పుడూ మంచి ఎనర్జీతో ఉంటాడు ఈ హీరో. ఈ మధ్య కాలంలో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్యకు మంచి దోస్త్ కూడా అయ్యాడు. కనిపెట్టారా..?

Tollywood: అందరూ యూనిఫామ్‌లో ఉంటే.. ఈ కుర్రాడు మాత్రం సివిల్‌లో.. ఇప్పుడు తెలుగులో మస్త్ మాస్ హీరో
Hero Childhood Photo
Ram Naramaneni
|

Updated on: Feb 08, 2023 | 8:01 PM

Share

సోషల్ మీడియాలో ఇప్పుడు ఫ్యాన్ పేజీల హవా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ సినిమా రిలీజ్ అవుతున్నా.. బర్త్ డే ఉన్న.. ఇంకా ఏదైనా అకేషన్ ఉంటే చాలు… ఆ రోజు ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదు. ట్విట్టర్ ట్రెండింగ్‌తో తమ ఫేవరెట్ యాక్టర్ పేరు వచ్చేవరకు దుమ్ము లేపేస్తారు. ఇక ఆయా సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలను ఈ మధ్య తెగ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలాంటి  ఓ ఫోటోను మీ ముందుకు తెచ్చాం. ఈ ఫోటోలో ఉన్న కుర్రాడిని గుర్తపట్టారా..? ఇప్పుడు హీరోగా రాక్ చేస్తున్నాడు. మాస్ సినిమాలతో హోరెత్తిస్తున్నాడు. ప్రేమ కథల్లోను నటిస్తూ.. తనలోని రొమాంటిక్ టచ్ చూపిస్తున్నాడు. కేవలం యాక్టింగ్ మాత్రమే కాదండోయ్.. దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు సైతం నిర్వరిస్తున్నాడు. పోలికలను బట్టి ఇప్పటికే అతడు ఎవరో చాలామంది గుర్తు పట్టే ఉంటారు.

ఐడెంటిఫై చెయ్యనివాళ్లు డోంట్ వర్రీ. అతనెవరో మేం రివీల్ చేయబోతున్నాం. హీ ఈజ్ నన్-అదర్‌దెన్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్. 27 ఏళ్ల ఈ కుర్రాడు ఇప్పుడు ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు. 2017లో వెళ్లిపోమాకేతో అరంగేట్రం చేసాడు విశ్వక్. తరుణ్ భాస్కర్ తీసిన.. ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఫలక్ నూమా దాస్ మూవీతో తనలోని డైరెక్షన్ టాలెంట్ కూడా చూపించాడు. హిట్ : ఫస్ట్ కేస్, పాగల్, ఓరి దేవుడా చిత్రాలు అతడికి మంచి పేరు తెచ్చాయి.

ప్రజంట్ దాస్ కా దమ్కీ అనే సినిమాలో నటిస్తున్నాడు విశ్వక్. ఈ సినిమాకు కూడా అతడే డైరెక్టర్. ఇవి కాక గామి, అక్టోబర్ 31 లేడీస్ నైట్ సినిమాల్లో కూడా కనిపించనున్నాడు. ఇక వివాదాలు కూడా ఈ హీరోని వెంటాడుతూనే ఉంటాయి. నటుడు అర్జున్ డైరెక్షన్‌లో ఓ సినిమాకు కమిటయ్యి.. నాటకీయ పరిణామాల మధ్య దాన్నుంచి బయటకు వచ్చాడు విశ్వక్.

View this post on Instagram

A post shared by Vishwaksen (@vishwaksens)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.