Tamannaah: ఆ సినిమా హిట్ అయ్యిందంటే నా పాట వల్లే.. షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా
ఈ అమ్మడు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ.
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించింది. తెలుగులో మరీనూ.. టాలీవుడ్ లో చివరిగా ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి నటించిన బోళాశంకర్ సినిమాలో నటించింది. ఆ సినిమా డబుల్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ అమ్మడు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ. ఇక హ్యాపీ డేస్ సినిమాతో ఈ చిన్నది విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత ఈ చిన్నది వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. తమన్నా తక్కువ సమయంలోనే క్రేజ్ సొంతం చేసుకోవడంతో పాటు స్టార్ హీరోయిన్ గా మారింది.
అప్పట్లో అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. కట్ చేస్తే సన్యాసి..
హీరోయిన్ గా దాదాపు అందరూ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ వయ్యారి. ఇక ఈ అమ్మడు రీసెంట్ గా బాలీవుడ్ లో సీరీస్ లతో మెప్పిస్తుంది. అలాగే పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. జైలర్ సినిమాలో తమన్నా నటించిన స్పెషల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
16 ఏళ్లకే ఫేక్ వీడియోలు.. కట్ చేస్తే 18 ఏళ్లకే తోపు హీరోయిన్.. ఎవరంటే..
అలాగే రీసెంట్ గా బాలీవుడ్ లో స్త్రీ 2 సినిమాలో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్ అయ్యింది. అలాగే ఆ సాంగ్ లో తమన్నా తన అందాలతో ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా తమన్నా.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. స్త్రీ 2 సక్సెస్‌కి కారణం తన పాటే అని చెప్పింది.2018 లో వచ్చిన స్త్రీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఇందులో రాజ్‌కుమార్ రావ్ , శ్రద్ధా కపూర్ నటించారు. దీని తర్వాత వచ్చిన స్త్రీ 2వ భాగం ఇటీవలే విడుదలై విజయం సాధించింది. ఈ సినిమా విజయంలో తమన్నా’ ఆజ్ కీ రాత్’ పాట కూడా పాత్ర పోషించిందని నటి తమన్నా అన్నారు. ఈ పాటకు నటి తమన్నా డ్యాన్స్ ఇరగదీసింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..