AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: షారుఖ్ సినిమా కోసం రెమ్యునరేషన్ తక్కువ తీసుకున్నా.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో షారుఖ్ ఖాన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఒకప్పుడు అనేక లవ్ స్టోరీ చిత్రాలతో అమ్మాయిల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. ఇప్పటికీ షారుఖ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవలే పఠాన్, జవాన్, డుంకీ చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నాడు.

Tollywood: షారుఖ్ సినిమా కోసం రెమ్యునరేషన్ తక్కువ తీసుకున్నా.. హీరోయిన్ సంచలన కామెంట్స్..
Shah Rukh Khan Movie
Rajitha Chanti
|

Updated on: Nov 03, 2024 | 3:40 PM

Share

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో తాప్సీ ఒకరు. ఇతర హీరోయిన్స్ మాదిరిగా కమర్షియల్ చిత్రాల్లోనే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వైవిధ్యమైన పాత్రలతో నటిగా ప్రశంసలు అందుకుంది. నటిగానే కాకుండా సామాజిక సమస్యలపై ధైర్యంగా మాట్లాడుతుంది తాప్సీ. గతంలో మత విద్వేషాలు, ఇతర అంశాలపై తన వైఖరిని వ్యక్తం చేసింది. అలాగే మహిళల భద్రత, ఇండస్ట్రీలో సమానత్వంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఇటీవల సినీరంగంలో స్త్రీలు, పురుషుల మధ్య రెమ్యునరేషన్ వ్యత్యాసంపై కూడా స్పందించింది. మహిళా ప్రధాన చిత్రాలలో నటించిన తాప్సీ పన్ను, మహిళా ప్రధాన చిత్రాల నుండి తనకు ఎక్కువ పారితోషికం లభిస్తుందని పేర్కొంది. అలాగే, సూపర్ స్టార్ నటులతో భారీ బడ్జెట్ చిత్రాల్లో మేల్ డామినేషన్ వల్ల తనకు తక్కువ రెమ్యునరేషన్ వచ్చిందని చెప్పుకోచ్చింది.

షారుఖ్ ఖాన్ నటించిన ‘డంకీ’ సినిమాలో నటించినందుకు తక్కువ పారితోషికం తీసుకున్నట్లు వెల్లడించింది. అలాగే స్టార్ నటీనటుల సినిమాల్లో నటిస్తున్నప్పుడు నిర్మాతలు ఏదో తమపై దయ చూపుస్తున్నట్లు ప్రవర్తిస్తారని.. స్టార్ యాక్టర్ ఉన్నారని.. మహిళా ప్రధాన పాత్రలు అవసరం లేదని.. కానీ హీరోయిన్స్ కు మేలు చేయడం కోసం.. వారి కెరీర్ అభివృద్ధి చెందుతుందని ఆఫర్స్ ఇస్తున్నాము.. ఇంకా డబ్బుదేముంది అన్నట్లు మాట్లాడతారని చెప్పుకొచ్చింది. ఇలాంటి మాటలపై తాను ప్రతిరోజూ పోరాటం చేస్తున్నానని.. పెద్ద ప్రొడక్షన్స్ హౌస్ లో హీరోయిన్స్ పాత్రలపై చిన్నచూపు ఉంటుందని తెలిపింది.

తాప్సీ పన్ను ప్రకారం.. ఆమె పురుషాధిక్య చిత్రాల కంటే మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాల ద్వారానే ఎక్కువగా పారితోషికం తీసుకుంటుంది. ‘హసీనా దిల్రుబా’, ‘దఖ్-దఖ్’, ‘దోబారా’, ‘బ్లర్’, ‘శభాష్ మిథు’, ‘రష్మీ రాకెట్’, ‘మన్మార్జియా’ వంటి అనేక ఇతర మహిళా ప్రధాన చిత్రాలలో నటించింది తాప్సీ. ప్రస్తుతం ‘ఖేల్ ఖేల్ మే’, ‘వో లడకీ హై కహా’ సినిమాల్లో నటిస్తోంది.

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్‏ను చూస్తే షాకవ్వాల్సిందే..

Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.