అధములం కాదు..ప్రథములం..మరోసారి తెలుగువాడి సత్తా చాటిన ‘సైరా’

ఇప్పుడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే దానికి కారణం..ఎంతోమంది ప్రాణధానం. స్వాతంత్య్రం కోసం కొందరు శాంతి మార్గాన్ని అన్వేశిస్తే..మరికొందరు హింసా మార్గాన్ని ఎన్నుకున్నారు.  ఈ మార్గాల్లో ఏది గొప్పదో, ఏది కాదో అన్న వాదన ఇప్పుడు అసందర్భం. వారిలో కొందరు మనకు తెలిసినవాళ్లు..మరికొందరు చరిత్రగర్భంలో కలిసిపోయినవాళ్లు. వాళ్ల త్యాగాల పునాది ఈరోజుటి మన స్వేచ్ఛా భారతం.  కానీ తెల్లవాళ్లు భారతదేశాన్ని దోచుకుంటున్నప్పుడు మొట్టమొదటిసారిగా వ్యతిరేకించింది రేనాటి సూర్యడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన తల కోట గుమ్మానికి వేలాడి ఉండొచ్చు […]

  • Ram Naramaneni
  • Publish Date - 6:57 pm, Wed, 2 October 19
అధములం కాదు..ప్రథములం..మరోసారి తెలుగువాడి సత్తా చాటిన 'సైరా'

ఇప్పుడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే దానికి కారణం..ఎంతోమంది ప్రాణధానం. స్వాతంత్య్రం కోసం కొందరు శాంతి మార్గాన్ని అన్వేశిస్తే..మరికొందరు హింసా మార్గాన్ని ఎన్నుకున్నారు.  ఈ మార్గాల్లో ఏది గొప్పదో, ఏది కాదో అన్న వాదన ఇప్పుడు అసందర్భం. వారిలో కొందరు మనకు తెలిసినవాళ్లు..మరికొందరు చరిత్రగర్భంలో కలిసిపోయినవాళ్లు. వాళ్ల త్యాగాల పునాది ఈరోజుటి మన స్వేచ్ఛా భారతం.  కానీ తెల్లవాళ్లు భారతదేశాన్ని దోచుకుంటున్నప్పుడు మొట్టమొదటిసారిగా వ్యతిరేకించింది రేనాటి సూర్యడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన తల కోట గుమ్మానికి వేలాడి ఉండొచ్చు కానీ తెల్లోడి ముందు ఏనాడు వంగలేదు.

బ్రిటీష్‌వారి కింద దాస్యానికి లొంగనని ఎదిరించాడు నరసింహారెడ్డి. ఆయన పోసిన ఊపిరి ఎంతోమందికి మార్గనిర్దేశకంగా మారింది. దేశవ్యాప్తంగా మహా ఉద్యమమే  మొదలయ్యింది. 1857 నుంచి ఆయన మొదలుపెట్టిన పోరాటానికి 1947లో ముక్తి లభించింది. దక్షిణాదిన.. అది కూడా కర్నూలు ప్రాంతాన జన్మించి ఉద్యమానికి ఊపిరి ఊదిన తెలుగోడు నరసింహారెడ్డి. బాలకృష్ణ సినిమా తీస్తే గానీ..తెలుగువాడైన గౌతమిపుత్ర శాతకర్ణి అనే మహారాజు గురించి మనలో చాలామందికి తెలియలేదు. ఇప్పుడు చిరంజీవి నటిస్తే..కానీ రేనాటి సూర్యుడు కథ ప్రపంచం ముందుకు రాలేదు. తెలుగు ప్రపంచానికే స్పూర్తినిచ్చింది. వీరందరూ అన్ సంగ్ హీరోస్. వీరే కాదు ఇంకా ఎంతో గొప్ప గొప్ప మంది స్వాతంత్య్రం కోసం, దేశం కోసం రక్తాన్ని ధారబోసి కనుమరుగైపోయారు. కానీ ప్రస్తుత తెలుగు దర్శకులు, కథానాయకుల చరిత్రను వెలికితీసే పనిలో పడ్డారు. ఇది నిజంగా గొప్ప విషయం. వారి జీవితాల నుంచి ప్రస్తుత తరాలు స్పూర్తి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా తెలుగు సినిమా ‘సాహో’..తెలగు జాతి ‘సాహో’ అని ప్రపంచం వెలుగెత్తి చాటే సమయం ఆసన్నమైంది.