Upasana: ఉప్సీ వదిన మా అన్నను క్షమించేయండి.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న క్యూట్ వీడియో

నటుడు రామ్‌చరణ్‌ పై ఆయన సతీమణి ఉపాసన స్వీట్ రివెంజ్‌ తీర్చుకున్నారు. ఆ డీటేల్స్ ఏంటో చూసేద్దాం పదండి..

Upasana: ఉప్సీ వదిన మా అన్నను క్షమించేయండి.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న క్యూట్ వీడియో
Ram Charan - Upasana

Updated on: Feb 12, 2023 | 2:48 PM

ఉప్సీ-చరణ్.. టాలీవుడ్ వన్నాఫ్ ద క్యూట్ కపుల్. ఇటీవల ఉపాసన ప్రెగ్నెంట్ అవ్వడంతో.. ఆ ఇంట సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అయితే ఉప్సీ చరణ్‌‌పై రివేంజ్ తీర్చుకున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో వదినా మా అన్నను క్షమించి వదిలేయ్ అంటూ చెర్రీ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఓ కార్యక్రమంలో తనను సోఫాలో నుంచి లేపడంతో.. భంగపడ్డ ఆమె.. ఇంటికి వెళ్లాక.. చరణ్‌తో ఇంటి పనులు చేయించారు. అయితే ఇదంతా నిజం కాదండోయ్. ఓ ఫ్యాన్స్ చేసిన క్రేజీ ఎడిట్ మాత్రమే.

నాలుగు నెలల క్రితం అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించింది అల్లు కుటుంబం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన, చరణ్, సాయిధరమ్‌ తేజ్.. స్టేజ్‌ముందు ఓకే సోఫాలో కూర్చొన్నారు. సోఫా కాస్త ఇరుకుగా ఉండటంతో ఉపాసనను పక్క సోఫాలోకి పంపాడు చరణ్. దీంతో ఉప్సీ చిరు కోపాన్ని ప్రదర్శించింది.  ఆమెను ఆట పట్టించినందుకు చరణ్, తేజ్ సరదాగా నవ్వుకున్నారు. ఈ వీడియో అప్పట్లో నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది.

అయితే, ఈ సీన్‌ తర్వాత చరణ్‌ ఇంటికి వెళ్లాక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఫన్నీగా చెప్పాలనుకున్నాడు ఓ ఫ్యాన్. అందుకు తగ్గట్లుగా ఈ వీడియోకు లాక్‌డౌన్‌ సమయంలో చరణ్‌ ఇంటి పనులు చేసిన ఓ వీడియోను యాడ్ చేసి ‘‘ఉపాసన మేడమ్‌ రివెంజ్‌’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది ఉపాసన కంట పడటంతో పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంది. ఆపై ఇన్‌స్టా స్టోరీల్లో ఆ వీడియోని షేర్‌ చేస్తూ స్మైలీ ఎమోజీలను యాడ్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..