Leo Movie : దళపతి విజయ్ లియో ఓటీటీ స్ట్రీమింగ్‌పై సస్పెన్స్.. రిలీజ్ ఆ రోజేనా..

లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. హాయ్ ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహించిన ఖైదీ, విక్రమ్ సినిమాలకు లింక్ చేస్తూ లియో సినిమాను తెరకెక్కించాడు. ముందుగా ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Leo Movie : దళపతి విజయ్ లియో ఓటీటీ స్ట్రీమింగ్‌పై సస్పెన్స్.. రిలీజ్ ఆ రోజేనా..
Vijay Leo

Updated on: Nov 16, 2023 | 8:01 AM

దళపతి విజయ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లియో. ఇటీవలే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. హాయ్ ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహించిన ఖైదీ, విక్రమ్ సినిమాలకు లింక్ చేస్తూ లియో సినిమాను తెరకెక్కించాడు. ముందుగా ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల అంచనాలు తారుమారయ్యాయి.కానీ ఆతర్వాత లియోకు మంచి టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాకు రెండో పార్ట్ ఉంటుందని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు లియో సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది.

రేపు అంటే శుక్రవారం లియో సినిమా ఓటీటీలో రానుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ లియో సినిమా ఓటీటీ రైట్స్ ను ఫ్యాన్స్ రేటుకు కొనుగోలు చేసిందని అంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు లియో సినిమాను స్ట్రీమింగ్ కూడా చేయనున్నారని అంటున్నారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో లియో సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఇంతవరుకు దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. దాంతో లియో సినిమా ఓటీటీలోకి వస్తుందా రాదా అన్న ఆసక్తి నెలకొంది. ఈ మధ్య కొన్ని సినిమాలు చడీచప్పుడు లేకుండా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అలాగే లియో సినిమా కూడా సడన్ గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని కొంతమంది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.