Sushanth: నీలి కళ్లతో భయపెడుతున్న అక్కినేని యంగ్ హీరో.. రావణాసుర నుంచి లేటెస్ట్ పోస్టర్..

|

Mar 18, 2022 | 8:10 PM

ఇటీవల ఖిలాడి సినిమాతో హిట్ కొట్టిన మాస్ మహారాజ రవితేజ.. ఇప్పుడు నెక్స్ట్ సినిమాల పై దృష్టి పెట్టారు. మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మల

Sushanth: నీలి కళ్లతో భయపెడుతున్న అక్కినేని యంగ్ హీరో.. రావణాసుర నుంచి లేటెస్ట్ పోస్టర్..
Sushanth
Follow us on

Sushanth: ఇటీవల ఖిలాడి సినిమాతో హిట్ కొట్టిన మాస్ మహారాజ రవితేజ.. ఇప్పుడు నెక్స్ట్ సినిమాల పై దృష్టి పెట్టారు. మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మల ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర`. ఇటీవలే కీల‌క‌మైన భారీ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రవితేజతో పాటు కీలక పాత్రలో నటిస్తున్న అక్కినేని యంగ్ హీరో సుశాంత్ కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు. సుశాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల అల వైకుంఠపురంలో సినిమాలో సుశాంత్ నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో సుశాంత్ కు మంచి పేరు వచ్చింది. ఆ జోష్ లోనే ఇప్పుడు రావణాసుర సినిమాలో నటిస్తున్నాడు.

తాజాగా సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ టీమ్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. సుశాంత్ నీలి రంగు క‌ళ్ళ‌తో, పొడవాటి జుట్టు, గడ్డంతో తీక్ష‌ణంగా చూస్తున్నట్లు ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. దీనిని బ‌ట్టి ఆయ‌న పాత్ర వైవిధ్యంగా వుంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టి టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ ఇలా మొత్తం ఐదుగురు కథానాయికలు నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ లాయర్‌గా నటిస్తున్నాడు.

రచయితగా కొన్ని ప‌వ‌ర్‌ఫుల్ చిత్రాల‌కు ప‌నిచేసిన‌ శ్రీకాంత్ విస్సా ఈ సినిమా కోసం కొత్త తరహా కథను రాశారు. ప్రముఖ నటులు, సాంకేతిక సిబ్బంది ఈ చిత్రానికి ప‌నిచేస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంయుక్తంగా ఈ చిత్రానికి సంగీతం అందించగా రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా , సత్య, జయ ప్రకాష్ తదితరులు ఇతరపాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kashmir Files: కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్ర దర్శకుడికి భద్రత పెంపు.. వై క్యాటగిరీ కల్పిస్తూ అధికారుల నిర్ణయం..

Prabhas: మారుతి సినిమాకు ప్రభాస్‌ అన్ని కోట్లు తీసుకుంటున్నారా.? రోజుకు ఏకంగా కోటి రూపాయల పైమాటే..

Bheemla Nayak Aha: ఆహాలో పవర్ స్ట్రోమ్.. స్ట్రీమింగ్‏కు సిద్ధమైన బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్..