బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసింది. కెరీర్ మంచి రైజ్ లో ఉన్న దశలో అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నది మిస్టరీగా మారింది. హీరో మరణంతో అతడి స్వస్థలమైన బిహార్‌లోని పట్నాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుశాంత్ హఠాన్మరణం పట్ల అతడి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ సూసైడ్ చేసుకోలేదని.. హత్య జరిగుంటుందని అతని మేనమామ ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.
“ఇది మర్డర్. ఈ ఘటనపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని బిహార్ యువ సంఘం, రాజ్‌పుత్ మహాసభ డిమాండ్ చేస్తున్నాయి. ఈ హత్యపై దర్యాప్తు చేయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీని మేము కోరుతున్నాం. ఇటీవలే సుశాంత్ మేనేజర్ దిశా శాలిన్ సూసైడ్ చేసుకున్న కేసులో పోలీసులు సుశాంత్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు” అని సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మేనమామ ఆర్.సి. సింగ్ పేర్కొన్నారు.
తన మేనల్లుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ గతంలో తనతో పంచుకున్న కొన్ని విషయాలను ఆర్.సి.సింగ్ వెల్లడించారు. “హీరోగా తాను టాప్ రేంజ్ కి వెళ్లాలనుకున్నాడు. దీనికోసం అతడు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నట్టు చెప్పేవాడు” అని సుశాంత్ మేనమామ తెలిపారు.