AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: ఇంటర్‌లో సత్తా చాటిన సూర్య కూతురు.. మార్కులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

సూర్యకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి విజయాలను అందుకున్నారు. గజినీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. సూర్య నటించిన అన్ని సినిమాలు దాదాపు తెలుగులోనూ రిలీజ్ అయ్యాయి. ఇక సూర్య సతీమణి జ్యోతిక గురించి కూడా అందరికి తెలిసిందే..

Suriya: ఇంటర్‌లో సత్తా చాటిన సూర్య కూతురు.. మార్కులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Surya
Rajeev Rayala
|

Updated on: May 10, 2024 | 7:37 AM

Share

తమిళ్ స్టార్ హీరో సూర్య గురించి ఆయన క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ సపరేట్ స్టైల్ ను క్రియేట్ చేసుకున్నారు. సూర్యకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి విజయాలను అందుకున్నారు. గజినీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. సూర్య నటించిన అన్ని సినిమాలు దాదాపు తెలుగులోనూ రిలీజ్ అయ్యాయి. ఇక సూర్య సతీమణి జ్యోతిక గురించి కూడా అందరికి తెలిసిందే.. ఆమె కూడా హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తమ పిల్లను ఎంతో క్రమ శిక్షణతో పెంచుతున్నారు. సూర్య, జ్యోతికల ముద్దుల కుమార్తె దియా ఇటీవలే ఇంటర్ ఎక్జామ్స్ రాసింది. ఆమెకు వచ్చిన మార్కులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

12వ జనరల్ ఎగ్జామినేషన్ లో సూర్య కూతురు దియా సత్తా చాటింది. చాలా మంది సెలబ్రెటీల పిల్లలు అత్యధిక మార్కులు తెచుకోకపోయినా పాస్ అయ్యితే చాలు అనే మెంటాలిటీతో ఉంటారు. కానీ సూర్య కూతురు మాత్రం చదువులో సత్తా చాటుతుంది. ఆమె మార్కులు చూసి సూర్య జ్యోతిక తెగ సంబరపడిపోతున్నారు. కూతురిని ప్రశంసలతో ముంచెత్తుతుంటే.. తెగ మురిసిపోతున్నారు.

తమిళ్ లో వందకు 96 మార్కులు సాధించింది దియా.. అలాగే  ఇంగ్లీష్ లో 97, అకౌంట్స్ లో 94, ఫిజిక్స్ లో 99, కెమిస్ట్రీలో 98, కంప్యూటర్ సైన్స్ లో 97 మార్కులు తెచ్చుకుంది. మొత్తంగా 600కి 581 మార్కులు సాధించింది ఈ అమ్మడు. 96.83 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్ ఎగ్జామ్స్ లోనే కాదు.. అంతకు ముందు జరిగిన ఎగ్జామ్స్ లోనూ మంచి మార్కులు తెచ్చుకుంది. పదవ తరగతిలో 97 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించింది దియా. ఈ మార్కుల లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూర్య సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే