ET Twitter Review: మాస్ లుక్‌లో కేకపెట్టించిన సూర్య.. ఎవరికీ తలవంచడుతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడంటున్న ఫ్యాన్స్

|

Mar 10, 2022 | 9:26 AM

Suriya ET Movie Twitter Review: కోలీవుడ్(Kollywood) స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో సూర్య నటించిన తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ అవుతాయి. కరోనా..

ET Twitter Review: మాస్ లుక్‌లో కేకపెట్టించిన సూర్య.. ఎవరికీ తలవంచడుతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడంటున్న ఫ్యాన్స్
Suriya Et Movie Twitter Riv
Follow us on

Suriya ET Movie Twitter Review: కోలీవుడ్(Kollywood) స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో సూర్య నటించిన తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ అవుతాయి. కరోనా (Corona) నేపథ్యంలో సూర్య తన   ‘సూరరైపోట్రు’, ‘జైభీమ్’​ రెండు సినిమాలను డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. తాజాగా థియేటర్ లో సందడి చేయడానికి ‘ఈటీ (ఎవరికీ తలవంచడు)’ అంటూ మరో మూవీతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమాలతో సక్సెస్ అందుకునే డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పాండిరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య ఈరోజు తమిళ, తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన “ఈటీ” మూవీ సోషల్ మీడియా వేదికగా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ మూవీ అదిరిపోయిందని ఈలలు వేస్తున్నారు.

సూర్య మరోసారి ఈ సినిమాతో తన నటన విశ్వరూపం చూపించడానికి.. మహిళలకు భద్రత, భరోసా ఎలా కల్పించాలో ఈ సినిమాద్వారా దర్శకుడు అద్భుతంగా చెప్పాడని ఫ్యాన్స్ అంటున్నారు.  స్త్రీల సమస్యలపై పోరాడేే పాత్రలో ‘కన్నభిరన్​’గా సూర్య అద్భుతమని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమాలో మొదటి అర్ధభాగం.. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే.. సెకండ్ లో క్లాస్ గా డీసెంట్ గా సాగిందని.. మొత్తానికి సూర్య ఈటీ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడని అంటున్నారు. ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. గజని, యముడు,  జై భీమ్ వంటి  సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సూర్య.. ఇప్పుడు ‘ఈటీ (ఎవరికీ తలవంచడు)’ తో కూడా అలరిస్తున్నాడని సినిమా సూపర్ అని అంటున్నారు.

 

 

 

Also Read:

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్’ ఫ్యాన్స్.. ‘రాధేశ్యామ్’ నుంచి డార్లింగ్ హై క్వాలిటీ ఫొటోస్ మీ కోసం..