Rajinikanth: కడపలో రజనీకాంత్‌ ‘వెట్టయ్యన్‌’ షూటింగ్.. తలైవా కోసం భారీగా తరలివచ్చిన అభిమానులు.. వీడియో

తమిళ్ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్‌ కడప జిల్లాలో సందడి చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గ ఎర్రగుంట్ల ప్రాంతంలో ఉన్న నాపరాయి క్వారీలో తలైవా లేటెస్ట్ మూవీ వెట్టయ్యన్ మూవీ షూటింగ్  నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు టీజే జ్ఞానవేలు ఈ సినిమాను రూపొందిస్తున్నారు .

Rajinikanth: కడపలో రజనీకాంత్‌ వెట్టయ్యన్‌ షూటింగ్.. తలైవా కోసం భారీగా తరలివచ్చిన అభిమానులు.. వీడియో
Rajinikanth

Edited By:

Updated on: Jan 30, 2024 | 8:35 PM

తమిళ్ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్‌ కడప జిల్లాలో సందడి చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గ ఎర్రగుంట్ల ప్రాంతంలో ఉన్న నాపరాయి క్వారీలో తలైవా లేటెస్ట్ మూవీ షూటింగ్  నిర్వహించారు అందులో భాగంగా రజనీకాంత్ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను ఈ క్వారీలో చిత్రీకరించారు. అందుకోసం ఈరోజు కడప వచ్చిన రజనీకాంత్ షూటింగ్లో పాల్గొన్నారు. రజనీని చూసేందుకు కడప జిల్లా నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అభిమానులు ఎగబడ్డారు. రజనీకాంత్ నటిస్తున్న 170 సినిమా వెట్టయన్ కు సంబంధించి యాక్షన్స్ సన్నివేశాలను ఎర్రగుంట్ల ప్రాంతంలోని నాపరాయి గనిలో చిత్రీకరిస్తున్నారు. అందుకోసం చిత్ర యూనిట్ కడపకు చేరుకొని షూటింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రముఖ దర్శకుడు టీజే జ్ఞానవేలు ఈ సినిమాను రూపొందిస్తున్నారు . లైకా ప్రొడక్షన్స్ సారథ్యంలో రజనీకాంత్ 170 సినిమాను చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక ఫైట్ సన్నివేశాన్ని ఈ నాపరాయి గనిలో చిత్రీకరిస్తున్నారు. నిడిజీవి ప్రాంతంలోని ఎర్రగుంట్ల పురపాలక సంఘానికి చెందిన కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డికి చెందిన క్వారీలో ఈ షూటింగ్ జరుగుతుంది. మొత్తం రెండు రోజుల షెడ్యూల్ తో ఇక్కడ షూటింగ్‌ను ప్లాన్ చేసుకున్నట్లు చిత్ర యూనిట్ చెబుతున్నారు
మంగళవారం సినిమాకు సంబంధించిన రిహార్సల్స్ ను అలాగే బుధవారం సినిమాకు సంబంధించిన ఫైట్ సీన్లు చిత్రీకరించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. వీరంతా ఓ సిమెంట్ ఫ్యాక్టరీ కి సంబంధించిన విడిది గృహంలో బస చేసినట్లు చెబుతున్నారు.

కడపలో రజనీకాంత్ సందడి.. వీడియో

 

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us